బాహుబలి బర్త్ డే; ప్రభాస్ కు ప్రముఖుల విషెస్; జపాన్ లోనూ సెలబ్రేషన్స్!!
పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు ఈరోజు. దీంతో ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి. సినీ ప్రముఖుల నుండి మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖుల నుండి కూడా ప్రభాస్ కు పుట్టినరోజు విషెస్ వర్షం కురుస్తుంది. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతోమంది ప్రభాస్, పుట్టినరోజును అభిమానులు ఎంతో సందడిగా జరుపుకుంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కేక్స్ కట్ చేస్తూ, అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ హంగామా చేస్తున్నారు. ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రియమైన ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం మీరు అద్భుతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానని, మీ కీర్తి మరింత విస్తరించాలని ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నానని చిరంజీవి ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా సెల్వమణి ప్రభాస్ తో తాను ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూ విష్ చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా బైక్స్ తో భారీ ర్యాలీ నిర్వహించారు.
వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ప్రభాస్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సలార్ మరియు కల్కి సినిమాల కోసం అందరి ఫ్యామిలీ మాదిరిగా తాను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇండియా అభిమానులను మించి జపాన్ అభిమానులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు.
జపాన్ లో పలువురు ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టినరోజును ఒక పండుగలా సెలబ్రేట్ చేశారు. ప్రభాస్ ఫోటోలకు పూలదండలు వేసి బర్త్ డే డెకరేషన్స్ చేశారు. దేవుడికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా పూజలు చేస్తూ రకరకాల పదార్థాలను తయారుచేసి ప్రభాస్ ఫోటోల ముందు పెట్టి, ఆపై సహపంక్తి భోజనాలు చేశారు.
ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జపనీస్ మనకంటే ప్రభాస్ పై ఎక్కువ అభిమానాన్ని చూపించడం ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తంగా దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోతున్నాయి.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications