ఫౌజీ మూవీ నుంచి ప్రభాస్ డేంజరస్ లుక్ లీక్.. సోషల్ మీడియా షేక్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించారు డార్లింగ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది మార్చి 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే అంతకుముందే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చే విధంగా భారీ పీరియాడికల్ మూవీ ఫౌజీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఫౌజీ మూవీని డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
🚨 #FAUZI? 👀🔥
— ft.aur_v (@ftnewsdaily) September 4, 2026
Prabhas in a raw, intense & dangerous avatar — this doesn’t look like his usual screen presence at all! ⚔️🩸
Set against the backdrop of India’s pre-independence era, this look hints at a much darker and more intense chapter of the story. 🔥
If this is really… pic.twitter.com/eQEIl9rx32
అయితే తాజాగా ఫౌజీ చిత్రం నుంచి ఓ షాకింగ్ పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ప్రభాస్ డేంజరస్ లుక్ లో కనిపిస్తున్నారు. రా అండ్ ఇంటెన్స్ అలాగే డేంజరస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని లుక్ లో ఆయన ఉన్నారు. ఈ మూవీ ప్రీ- ఇండిపెండెన్స్ కాలంలో జరుగుతుంది. ఒకవేళ ఇదే లుక్ నిజమైతే ప్రభాస్ ఎన్నడూ చూడని లుక్ లో దర్శనం ఇచ్చినట్లు అయింది. ఇక ఈ మూవీకి హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఫౌజీ మూవీని ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీ హీరోయిన్ గా నటించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, రాహుల్ రవీంద్రన్, చైత్ర జే. ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ఫౌజీ ప్రమోషన్స్ లో ప్రొడ్యూసర్ నవీన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభాస్ కెరీర్ లోనే ఫౌజీ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications