ఫస్ట్ టైమ్ కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్ .. వీడియో వైరల్
రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత ప్రతి యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పౌరాణికం, హార్రర్ కామెడీ.. ఇలా ప్రతి జానర్ సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే ది రాజా సాబ్, ఫౌజీ.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజైన టీజర్ కు భారీగా స్పందన వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 5 న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి అంతకుముందు సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఫౌజీ చిత్రాన్ని అంతకుమించిన స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడిలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.

మరోవైపు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రభాస్ ఆ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్-2, కల్కి-2లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫస్ట్ మూవీ ఈశ్వర్ పూజాకార్యక్రమం సమయంలో 'ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు, ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు' అనే డైలాగ్ చెప్పాను.. ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలియదు.. టెన్షన్ లో చెప్పేశానని ఆ వీడియోలో ఉంది. ఆ డైలాగ్ చెప్పాక తన తండ్రి తన చేయి పట్టుకుని యస్ అన్నారు.. ఫస్ట్ టైమ్ కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications