బట్టలు లేకుండా ప్రభాస్.. "స్పిరిట్" కోసం డార్లింగ్ డేరింగ్ స్టెప్ !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. రీసెంట్ గానే డార్లింగ్ బర్త్ డే సందర్భంగా.. 'ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్' పేరుతో ఒక ఆడియో రిలీజ్ చేశారు. అందులో 1 నిమిషం 31 సెకన్ల నిడివి ఉన్న ఈ సౌండ్ గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్దన్ రాణె సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించనున్నారు. ఇది ఒక సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం ప్రభాస్ ఓ డేరింగ్ స్టెప్ వేయనున్నట్టు తెలుస్తోంది.

సందీప్ తన సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఎలాంటి బోల్డ్ పాత్రల్లో హీరోలను చూపించాడో మనం చూశాం. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ అత్యంత బోల్డ్ అండ్ మాసివ్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అందులో భాగంగానే ప్రభాస్ తన సినిమా కెరీర్ లో షర్ట్ లేకుండా కనిపించిన సీన్స్ ఉన్నాయి కానీ.. మొట్టమొదటి సారి స్పిరిట్ మూవీ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపించనున్నారట. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సందీప్ తెరకెక్కించిన యానిమల్ మూవీలో కూడా రణ్ బీర్ బట్టల్లేకుండా వచ్చే సీన్ ఉంది. ఈ మూవీలో కూడా ప్రభాస్ అలా ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. అందుకే ప్రూఫ్ ఇదే అంటూ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియో టీజర్ చూపిస్తున్నారు. అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని! ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం.. వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్‌కు పంపించండి అంటాడు. అప్పుడు ప్రభాస్.. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటుందని అంటాడు. దీంతో ప్రభాస్ ఇలా బట్టలు లేకుండా కనపడడం ఫిక్స్ అంటూ షాక్ అవుతున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సీన్ పట్ల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరోవైపు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" సినిమా చేస్తున్నారు. అవి పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి - 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమాకు కమిట్ అయ్యారు.
-
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications