రెబల్ స్టార్ టూ "ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్".. ప్రభాస్ 2.O !!

ప్రభాస్.. ఈ ఒక్క పేరు చాలు సినిమా రిలీజ్ రోజే వంద కోట్లు కలెక్షన్స్ సాధించడానికి. దివంగత కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి వంటి చిత్రాలతో స్టార్ హీరో అయ్యారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌ తో కల్కి - 2 , ప్రశాంత్‌ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో ఒక సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేశారు. రాజా సాబ్ నుంచి మేళతాళాలతో ప్రభాస్‌ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్‌ను చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

prabhas-got-new-tag-of-indias-biggest-super-star-in-spirit-audio-promo

అంతే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది. ఆ ఫోటోలో చరిత్రలోని మరుగునపడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది అని రాసి ఉంది. ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్నట్టు రూపొందించారు.

ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమా నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే పోస్టర్ లాంటివి కాకుండా 'ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్' పేరుతో ఒక ఆడియో రిలీజ్ చేశారు. అందులో 1 నిమిషం 31 సెకన్ల నిడివి ఉన్న ఈ సౌండ్ గ్లింప్స్‌లో, ఒక ఐపీఎస్ అధికారి అయిన ప్రభాస్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్‌ ఉన్నా, లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని! ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం.. వీడి బట్టలూడదీసి మెడికల్‌ టెస్ట్‌కు పంపించండి అంటాడు. అప్పుడు ప్రభాస్.. మిస్టర్‌ సూపరింటెండెంట్‌, నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటుందని అంటాడు. ఇక ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్‌ ఒబెరాయ్‌, కాంచన, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్దన్‌ రాణె సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్‌ వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి వరకూ ప్రభాస్ ని యంగ్ రెబల్ స్టార్ అని, రెబల్ స్టార్ అని అందరూ పిలుచుకుంటున్నారు. కానీ సందీప్ మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ కి ''ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్'' అని టైటిల్ కార్డు వేశారు. షారుఖ్ ఖాన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ సహా పలువురు హీరోల అభిమానులు ఆ టైటిల్ కార్డ్ విషయంలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+