ప్రభాస్ గొప్ప మనసు.. వయనాడ్ బాధితులకు భారీగా.. కోట్ల విరాళం!!

కేరళలోని వయనాడ్ వరదల కారణంగా జరిగిన భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయారని అధికారిక సమాచారం. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

కేరళలో కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రముఖుల స్పందన
కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపం సృష్టించిన విషాదం ఎన్నో జీవితాలను చిద్రం చేసింది. . ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్, కేరళ అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది. అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

Prabhas is better than Chiranjeevi and Ram Charan in helping Wayanad victims gave Rs 2crores donation

వయనాడ్ బాధితులకు అండగా సినీ ప్రముఖులు
బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

భారీ విరాళం ఇచ్చిన దక్షిణాది స్టార్స్
తమిళ మహిళా సూపర్ స్టార్ నయనతార ఆమె భర్త కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతుగా 20 లక్షల రూపాయలను అందించారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ కూడా తమ వంతుగా సహాయం అందించారు. అల్లు అర్జున్ వయనాడ్ బాధిత కుటుంబాలకు 25 లక్షలు విరాళం ఇవ్వగా, చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు.

ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్
ఇక వీరందరికంటే ప్రభాస్ దాతృత్వం లో తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించారు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గొప్ప మనసును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ లో అందర్నీ దాతృత్వంలో ప్రభాస్ వెనక్కి నెట్టారని చర్చిస్తున్నారు. ప్రభాస్ మంచి, గొప్ప మనసుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+