'కల్కి' అన్‌స్టాపబుల్: సామీ.. నువ్వు శిఖరం
వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.600 కోట్ల బడ్జెట్ తో సి.అశ్వనీదత్ నిర్మించి భారీ చిత్రరాజం కల్కి. ఐదు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమేకాదు.. దేశవ్యాప్తంగా, అమెరికాలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వచ్చేనెల 15వ తేదీన రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ విడుదల కాబోతోంది. అప్పటివరకు ఈ చిత్రానికి కలెక్షన్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో హీరో కావడంవల్లే ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం సాధ్యమైందంటున్నారు.
రూ.1100 కోట్ల పోస్టర్ విడుదల
తాజాగా రూ.1100 కోట్లు సాధించినట్లు నిర్మాత అశ్వనీదత్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అమెరికాలో కూడా మరో వారంలో 20 మిలియన్ డాలర్లను రాబట్టబోతున్న సినిమాగా నిలవబోతోంది. అశ్వనీదత్ కు ఇప్పటివరకు రూ.125 కోట్ల లాభాలను ఈ సినిమా ఆర్జించి పెట్టింది. రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతుండటంతో ఆయనకు మరెన్ని లాభాలు రానున్నాయో చూడాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు నెమ్మదించిందికానీ విదేశాల్లో మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.

నైజాం నవాబుగా అవతరించిన ప్రభాస్
నైజాంలో కల్కి రూ.80 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో తనకు ఎదురులేదని దీంతో ప్రభాస్ మరోసారి నిరూపించినట్లైంది. దీనితర్వాత రాబోయే రాజాసాబ్, సలార్2, స్పిరిట్ సినిమాలకు ఏ స్థాయిలో కలెక్షన్లు రానున్నాయో అనే ఆసక్తి విశ్లేషకుల్లో ఏర్పడింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. సైన్స్ ఫిక్షన్ ను పురాణాలకు ముడిపెట్టి సినిమాను తీయడం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ ఆకర్షించింది. కల్కి రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కర్ణుడిగా ప్రభాస్ నటించడం చూసి అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. రెండో భాగంలో కర్ణుడి పాత్రలో సినిమా మొత్తం ప్రభాస్ ను చూడాలని డార్లింగ్ అభిమానులు తహతహలాడుతున్నారు.












Click it and Unblock the Notifications