ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ అప్డేట్.. రూ. 1000 కోట్ల బొమ్మ పార్ట్ 2 షూటింగ్ షురూ !!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం " కల్కి". నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అమితాబ్ ముఖ్య పాత్రలో నటించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వనీదత్ వ్యవహరించారు. కాగా ఈ మూవీకి సీక్వెల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి ఆమె స్థానంలో నటించేది ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శంకర్ పల్లి పరిసరాల్లో నిర్మించిన భారీ సెట్‌లో అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హీరో ప్రభాస్ కూడా త్వరలోనే ఈ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో 'సుమతి' పాత్రలో నటించిన దీపికా పదుకోణే.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారని టాక్ వినిపిస్తోంది.

కాగా ఇప్పటికే సాయి పల్లవికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సీక్వెల్‌కు 'కర్ణ: 3102 బీసీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇకపోతే సాయి పల్లవి సినిమాలు విషయానికి వస్తే.. మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచె మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్", తెలుగులో నాగచైతన్యతో "తండేల్" మంచి హిట్స్ గా నిలిచాయి.
ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications