రక్తంతో తడిచిన చొక్కాతో ప్రభాస్.. "స్పిరిట్" నుంచి లుక్ వైరల్ !!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి - 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమాకు కమిట్ అయ్యారు. కాగా రాజాసాబ్ మూవీ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే తన తర్వాత చిత్రాలపై ఫోకస్ పెట్టారు. అందులో అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రం ఒకటి. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " నటించనుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ కి సంబంధించి ఒక పోస్టర్ వైరల్ అవుతోంది.
నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలో.. ప్రభాస్ రక్తంతో తడిచిన షర్ట్ లో.. కారుకు ఆనుకొని కింద కూర్చొని కనిపిస్తున్నాడు. కారుతో పాటు కింద కూడా మొత్తం రక్తసిక్తమై కనిపిస్తోంది. పక్కనే గొడ్డలి కూడా ఉంది. దీంతో ఈ ఫోటో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. సందీప్ గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది.
#SPIRIT is going to be BOLD. BRUTAL. UNAPOLOGETIC.
— Rangasthalam (@RangasthalamIN) December 28, 2025
Everyone assumed that when Director #SandeepReddyVanga came on board to work with #Prabhas, he might tone down his signature style.
But looks like that’s not happening at all.
The boldness stays intact, the brutality remains… pic.twitter.com/Sx1tUs0fJA
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు..










Click it and Unblock the Notifications