ఆ హీరో వల్లే అలా జరిగిందంటున్న ప్రభాస్ హీరోయిన్..
'మాళవిక మోహనన్'.. ఈ తమిళ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇంత వరకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించకపోయినా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను మాత్రం కొల్లగొట్టింది. స్టార్ హీరో దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "పేట" చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. రీసెంట్ గానే విక్రమ్ తో కలిసి "తంగలాన్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాగా పలు సినిమాలతో ఈ అమ్మడు తెలుగు ఆడియన్స్ ని పలకరించినప్పటికీ.. అవి అన్నీ డబ్బింగ్ చిత్రాలే కావడం గమనార్హం. కానీ ఇప్పుడు ఫైనల్ గా గ్లోబర్ స్టార్ సరసన "రాజా సాబ్"మూవీలో నటించి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాళవిక మోహన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం పైనే బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

రెబల్ స్టార్.. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించారు. ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమనులతో పాటు మాళవిక కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్‌లో తన ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తెలుగు డెబ్యూ ఆలస్యం కావడానికి కారణం ఓ యంగ్ హీరో అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కారణం ఆ హీరోనే..?
మాళవిక మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ తో కలిసి తాను ఒక లవ్ స్టోరీలో నటించాల్సి ఉందని చెప్పుకొచ్చింది. కానీ ఆ సమయంలోనే విజయ్ మరో మూవీతో బిజీగా ఉన్న కారణంగా లవ్ స్టోరీ నుంచి తప్పుకున్నారని తెలిపింది. ఆ కారణం గానే తన ఫస్ట్ తెలుగు డెబ్యూ వాయిదా పడిందని వెల్లడించింది. మరి అప్పుడు విజయ్ మూవీతో హిట్ కొట్టి తెలుగులో క్రేజ్ పెంచుకుందాం అనుకున్న ఈ భామ.. ఇప్పుడు ప్రభాస్ మూవీతో అయిన సాలిడ్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

అటు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్.. సినిమా ముచ్చటలతో పాటే తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరోవైపు ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు.. భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు అలరించనున్నాయి. వాటితో పాటు దళపతి విజయ్ "జన నాయగన్", శివ కార్తికేయన్ పరాశక్తి కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications