మారిన లెక్కలు.. ఇండియాలో నెం. 1 హీరో ఇతనే..!

సాధారణంగా ఏ అభిమానికైనా తమ హీరో అంటే పిచ్చి, ప్రేమ, అభిమానం ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చొక్కాలు చింపుకుంటారు. స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయితే తమ హీరోనే తోపు అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా హంగామా చేస్తుంటారు. ఈ స్టార్ వార్స్ నెట్టింట ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఇటీవల ఓర్మాక్స్ అనే సంస్థ టాప్ 10 ఇండియన్ హీరోస్ పేరుతో ఓ లిస్టును విడుదల చేసింది. అయితే ఈ లిస్టులో బాలీవుడ్ ఖాన్ లను చిత్తు చేసి తెలుగు హీరో టాప్ ప్లేస్ లోకి వచ్చాడు. అతను ఎవరో కాదు.. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కావడం విశేషం. గతంలోనూ ప్రభాస్ ఈ లిస్టులో టాప్ ప్లేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఇండియాలో నెం. 1 హీరోగా ప్రభాస్ ఉండటం గమనార్హం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. గతేడాది ప్రభాస్ కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతకుముందు సలార్ సైతం సూపర్ హిట్ అయింది. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే డార్లింగ్.. మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన బాహుబలి మూవీ రెండు పార్ట్ లు కలిపి ఒకే పార్టుగా రానుంది. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీ థియేటర్లలోకి అక్టోబర్ 31 న విడుదల కానుంది.

ఇక ఓర్మాక్స్ ప్రతి నెలా రిలీజ్ చేసిన ఈ లిస్టులో ఎప్పటిలాగే ప్రభాస్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో తమిళ హీరో విజయ్ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. విజయ్ చివరి మూవీ జన నాయగన్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆ మూవీ తర్వాత విజయ్ తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కానున్నారు. ఇక మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. ఇటీవల పుష్ప-2 తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. ఈ లిస్టులో మూడో స్థానానికి ఎగబాకాడు.

Prabhas Reigns Supreme Tops Ormax Top 10 Indian Heroes List as Telugu Stars Claim Six Spots

అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. ఐదో స్థానంలో అజిత్ ఉన్నాడు. ఇక టాప్ 10 లో ఆరుగురు తెలుగు హీరోలు ఉండటం విశేషంగా చెప్పొచ్చు. గతంలో ఐదో స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 8 వ స్థానం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ విజయంతో 9 వ స్థానంలోకి వచ్చాడు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 10 వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన టాప్ 10 లో ఆరుగురు తెలుగు హీరోలు ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+