'సలార్' కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం డిసెంబరు 22వ తేదీన విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీసింహా తదితరులు నటించారు. మొదటి నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాలకు చేస్తున్న టెక్నీషియన్సే ఈ సినిమాకు కూడా పనిచేశారు.
ఈనెల 21వ తేదీన డంకీ విడుదల కాబోతోంది. ఇప్పటికే షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ తో రెండు భారీ బ్లాక్ బస్టర్లు కొట్టి ఉండటంతో డంకీ మీద కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వార్ ఈ రెండు సినిమాలమధ్య కొనసాగుతుందని, ఎవరిది పై చేయి అవుతుందో చెప్పడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.

సలార్ చిత్రంలో నటించినందుకు ప్రభాస్ కు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ను హోంబలే ఫిలింస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కూడా సినిమా మొత్తం ఉండటంతోపాటు హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. అందుకే అతనికి రూ.25 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఇతర పాత్రలు పోషించిన నటులకు కూడా భారీమొత్తంలోనే ముట్టినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని భగవంతుణ్ని కోరుకుంటున్నారు. ప్రభాస్ రేంజ్ కు ఒక భారీ బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో, ఎన్ని రికార్డులు తారుమారవుతాయో మరోసారి చూపిస్తామని, ప్రభాస్ స్టామినా, రేంజ్ ఏ హీరోకు లేదని గర్వంగా చెబుతున్నారు. 22న ఈ సినిమా జాతకం తెలిసిపోనుంది.












Click it and Unblock the Notifications