ఏందిరా సామా ఇది... సలార్ ట్రైలర్ రివ్యూ!
దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ విడుదలైంది. అలా విడుదలైన 15 నిముషాల్లో ఈ ట్రైలర్ కు 20 లక్షల వ్యూస్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ దేవా అనే పాత్రలో కనిపించనున్నారు. నీకోసం ఎర అయినా అవుతా.. సొర అయినా అవుతా.. నీ ఒక్కడి కోసం అంటూ ప్రభాస్ చిన్నప్పటి పాత్ర చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ట్రైలర్ లో డార్లింగ్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. 3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. శృతి హాసన్ కనిపించింది కొన్ని సెకన్లే అయినా ఆమె లుక్ బాగుంది. స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో ప్రభాస్ నటించారు. స్టోరీ లైన్ రొటీన్ అయినా ప్రశాంత్ నీల్ స్టైల్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.

ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టినట్లు అర్థమవుతోంది. కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తుండగా సలార్ పార్ట్ 1 ను షాకింగ్ ట్విస్ట్ తో ముగించనున్నట్లు సమాచారం. ట్రైలర్ ను ఇంకా మంచిగా కట్ చేసివుండాల్సిందని నెటిజన్లు అంటున్నారు. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవల్ లో ఉన్నాయి.
న్నారని తెలుస్తోంది.ట్రైలర్ ను మరింత బెటర్ గా కట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎప్పటినుంచో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న విజయాన్ని ఈ సినిమా ఇచ్చేలా ఉంది. డైలాగ్స్ సాధారణంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చెప్పొచ్చు. కేజీఎఫ్, కేజీఎఫ్2 ట్రైలర్లు విడుదలైన సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వినిపించాయి. ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరాయి.












Click it and Unblock the Notifications