హమ్మయ్య.. ప్రభాస్ పెళ్లి ఫిక్స్..? హైదరాబాద్ అమ్మాయితో..!
ప్రపంచంలో అనేక మిలియన్ డాలర్ ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకటి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవడమే మానేశారు. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఇక డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ ఆశించారు. కానీ ప్రభాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు ఆయన చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ జన్మలో ప్రభాస్ పెళ్లి చూస్తామా.. మాకోసం సరదాకైనా చేసుకోవచ్చుగా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. తోటి సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతుంటే మన డార్లింగ్ మాత్రం కనీసం ఒక్కసారైనా పెళ్లికొడుకు కావడం లేదంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు.
అయితే తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ సారి మాత్రం నేషనల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతోంది. దీంతో ఈసారి నిజంగానే ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కుతారని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ పెళ్లిచేసుకోనున్నారని తెలుస్తోంది. ఆయన వివాహానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. డార్లింగ్ పెళ్లి పనులను ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి దగ్గరుండి చూసుకుంటున్నారని వార్తలు రావడం ఆసక్తిని రేపుతోంది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో అనుష్కతో..
ప్రభాస్ వివాహంపై గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. స్టార్ హీరోయిన్ అనుష్కతో ఆయన వివాహం ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్స్ అని తేలిపోయింది. అప్పట్లో ప్రభాస్ పెళ్లిపై అనేక వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ గానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా ఆ వార్తలు నిజమై ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కుతారని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని సెటిల్ కాగా 45 సంవత్సరాలు దాటినా ప్రభాస్ మాత్రం పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉండటం అటు డార్లింగ్ ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ లోనూ ఆందోళన కలిగిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, స్పిరిట్, ఫౌజీ, ది రాజాసాబ్, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లోనూ ప్రభాస్ ఓ మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది












Click it and Unblock the Notifications