'సీనియర్స్ తర్వాతే మేము'.. ప్రభాస్ కీలక వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ది రాజాసాబ్' మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ది రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్ స్టైలిష్ పోనీ టెయిల్ లుక్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ మారుతి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ప్రభాస్ ఈ సినిమాలో లైఫ్ పెట్టారని.. అది చూసి ఓ అభిమానిగా తనకు కన్నీళ్లు ఆగడం లేదని అన్నారు. రీ రికార్డింగ్ సమయంలోనూ తాను తీసిన సినిమా చూస్తూ ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. మారుతి కన్నీళ్లు ఆగకపోవడంతో అతడ్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓదార్చారు. అయినా మారుతి ఏడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభాస్ స్టేజిపైకి వచ్చి మారుతిని ఓదార్చారు. డైరెక్టర్ మూడేళ్ల కష్టం ఇలా బయటకు వచ్చిందని అన్నారు.
ఇక ప్రభాస్ మాట్లాడుతూ.. సంక్రాంతికి రాజాసాబ్ తో పాటు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. సీనియర్స్ ఫస్ట్ అని.. తాము అన్నీ సీనియర్స్ నుంచే నేర్చుకున్నామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేశ్ కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర్ వర ప్రసాద్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే 15 ఏళ్ల తర్వాత తన నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ వస్తోందని ప్రభాస్ అన్నారు. చూసుకోవాలని.. అది కూడా సంక్రాంతికి వస్తోందని తెలిపారు. అలాగే ఈ సినిమాలో తన నాన్నమ్మ కూడా ఒక హీరో అని అన్నారు. ఈ మేరకు ఐ లవ్ యూ డార్లింగ్స్ అంటూ అభిమానుల్ని ఖుషీ చేశారు ప్రభాస్.

ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026 న విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్ ను చిత్ర యూనిట్ డిసెంబర్ 28 న విడుదల చేయనుంది. ఇక ఈ మూవీలో ప్రభాస సరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహన్ నటించారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ హారర్ జానర్ గా రూపొందింది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ పై చర్చ నడుస్తోంది. మూవీ దాదాపు 195 నిమిషాలు అంటే 3 గంటల 15 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రాజాసాబ్ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications