Prabhas : ఎక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రెబల్ స్టార్..
రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక, ఆదిపురుష్ వంటి సినిమాతో వైవిధ్యభరితమైన పాత్రను ఎంచుకున్నాడు. బాహుబలి, సలార్ సినిమాలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పడు సరికొత్తగా మరో కొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్. ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో నిలిచిన ఏకైక హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో ఏకైక హీరో ప్రభాస్ అని తన పేరును ఎక్స్ ప్రకటించింది. గత సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంవత్సరం జనవరి 1 మధ్య కాలంలో ఈ సంవత్సరం పాటు భారత్‌లోని ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ టాగ్స్‌ను ట్విట్టర్ తాజాగా విడుదల చేసింది. ఇక, ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే టాప్ టెన్ జాబితాలో ఉన్న ఏకైక నటుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ ఏడవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ రాముని పాత్ర చేసిన ఆదిపురుష్ సినిమా ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఈ సరికొత్త రికార్డుతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న ప్రభాస్ : ఇక, ప్రభాస్ ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా కల్కి 2989 ఏడీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ రీలిజయి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం అనంతరం ప్రభాస్ రాజాసాబ్ ప్రాజెక్టుతో సిద్దంగా ఉన్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications