తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా..

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో కోలీవుడ్ కు చెందిన ప్రదీప్ రంగనాథన్ దూసుకెళ్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దుమ్మురేపుతున్నాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో వరుసగా మూడు సినిమాలు రూ. 100 కోట్లు సాధించాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఆయనకే సాథ్యం. అయితే తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన LIK చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

అయితే పలు కారణాలతో ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. దాంతో సినీ ప్రియుల్లో ఈ మూవీపై బజ్ తగ్గిపోయింది. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే తమిళనాడులో మాత్రం ఈ మూవీకి అక్కడి యువత బ్రహ్మరథం పడుతున్నారు. LIK చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా అసలు లెక్క చేయడం లేదు. బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజుకంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

కానీ తెలుగులో మాత్రం ఈ మూవీ రిజల్ట్ డిఫరెంట్ గా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ ఎక్కలేదు. దాంతో తొలి రోజు నుంచే ఈ మూవీకి కలెక్షన్స్ తగ్గిపోయాయి. థియేటర్లలో కేవలం 30 నుంచి 40 శాతం సీట్లు మాత్రమే ఫిల్ అవుతున్నట్లు సమాచారం. ఇక ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయినట్లు తెలుస్తోంది.

PradeepRanganathan LIK Struggles at Telugu Box Office Below Expected Collections LIK movie Telugu

ప్రదీప్ రంగనాథన్ గత డ్యూడ్ మూవీ ఓపెనింగ్ తో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం. ఇక అటు రాయలసీమ మొత్తానికి కలిపి ఈ చిత్రానికి కేవలం రూ. 9 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే రావడం గమనార్హం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ మూవీని విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. అలాగే ఎస్. జే. సూర్య కీలక పాత్రలో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+