తల్లి కాబోతున్న సింగర్ సునీత..?
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సినీ సెలబ్రిటీల జీవితాల గురించి అయితే ఈ నెగిటివ్ ప్రచారం కాస్తా ఎక్కువగానే సాగుతోంది. తాజాగా సింగర్ సునీతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సింగర్ సునీతకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సునీత సొంతం. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది. ఇక సునీత వ్యక్తిగత జీవితానికి వస్తే..వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో తన మొదటి భర్తకు సునీత విడాకులిచ్చారు. తన మొదటి భర్తతో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మొదటి భర్తతో విడిపోయిన తరువాత సునీత కొంతకాలం సింగిల్‌గా జీవించారు.

ఆ తరువాత ప్రముఖ వ్యాపారి రామ్ వీరపనేనిను సునీత రెండో వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లిపై సునీత చాలానే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట్లాది రూపాయిలు ఉండటంతోనే సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారని చెప్పి ఆమెను దారుణంగా విమర్శించారు. తాజాగా సింగర్ సునీత ప్రెగ్నెంట్ అయ్యారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మరోసారి తమ నోటికి పని చెప్పారు.
43 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కూతురుకు పెళ్లి చేయాల్సిన వయస్సులో తల్లి కాబోతుందంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా సునీత ప్రెగ్నెంట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సునీత అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.












Click it and Unblock the Notifications