అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ ఎన్ని లక్షలంటే..?
అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక రీసెంట్ గానే ఘనంగా జరిగింది. గత శుక్రవారం (జూన్ 6)హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఆదివారం ( జూన్ 9, 2025 ) అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్.. తన భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి వచ్చారు. అయితే మహేష్ బాబు ఆన్ స్క్రీన్ లుక్స్ తో పాటు,. ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతకు ముందు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహంలో సైతం బాలీవుడ్ హీరోలను బీట్ చేసేలా కనిపించి ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు కూడా సాదాసీదాగా ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చినప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ధరించిన ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ గురించి నెటిజన్స్, ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. తీరా టీ షర్ట్ ధర చూసి షాక్ అవుతున్నారు. చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా ఆ రేంజ్ లో ధర ఉండడం ఏంటని షాక్ అవుతున్నారు.
టీ షర్ట్ ధర ఎంతంటే..?
మహేష్ బాబు టీ షర్ట్ ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ బ్రాండ్ కి చెందినదిగా గుర్తించారు. దాని ధర సుమారు రూ. 1.51 లక్షలు. అని.. ఖచ్చితంగా చెప్పాలంటే రూ. 1,51,678 ఉందని ఆన్ లైన్ లో వెతికి స్క్రీన్ షాట్స్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జై బాబు, జై బాబు అంటూ కామెంట్స్ చేస్తూ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు.
Super star @urstrulyMahesh’s sweater costs around ₹1.4L#MaheshBabu | #SSMB29 pic.twitter.com/2lc64Xx1NN
— VardhanDHFM (@_VardhanDHFM_) June 9, 2025
మరోవైపు మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ మూవీ షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ షూటింగ్ లో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications