రాజమౌళిని ఏడిపిస్తోన్న గ్లోబల్ స్టార్..పెద్ద మ్యాటరే..!!
ఎస్.ఎస్. రాజమౌళి. టాలీవుడ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనాపాఠీ. ఈ ఫిల్మ్‌మేకర్ ఒక సినిమా చేయాలని స్కెచ్ వేశాడంటే అంతే.. సినిమా కంప్లీట్ అయ్యేందుకు సమయం ఎక్కువ తీసుకోవచ్చు కానీ ... బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి తీరుతుంది. అందుకే రాజమౌళిని నమ్ముకున్న నిర్మాతలు ఎప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. కెరీర్ తొలినాళ్లలో బడ్జెట్ పరిధిలో ఉన్న సినిమాలు చేసినప్పటికీ... ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సింహాద్రి, ప్రభాస్‌తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్క, నాని సమంత ప్రధాన పాత్రల్లో ఈగ వంటి ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్‌ను ఒక రకమైన బడ్జెట్‌తో తీశాడు.రామ్‌చరణ్‌తో మగధీర ఇంకోసారి ప్రభాస్‌తో జతకట్టిన జక్కన్న బాహుబలి తీశాడు. ఈ సినిమాల బడ్జెట్ కూడా బాహుబలంతా అయ్యింది. ఇక RRR చిత్రంతో వేరే లెవెల్‌కు వెళ్లిపోయాడు ఈ దర్శకధీరుడు. కొన్ని వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసిన రాజమౌళికి ప్రస్తుతం రక్తకన్నీరు తెప్పిస్తోందట ఓ నటి. ఇంతకీ ఎవరామె..?
కాంప్రమైజ్ కానీ జక్కన్న
జక్కన్న సినిమా అంటే మామూలుగా ఉండదు. ఒక్కసారి మెగా ఫోన్ పట్టాడంటే ఖర్చు దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాడు. తను అనుకున్నది వచ్చే వరకు నిర్మాతకు బడ్జెట్ విషయంలో చుక్కలు చూపిస్తారు రాజమౌళి. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా తానడిగిన బడ్జెట్‌ను కాదనకుండా ఇచ్చేస్తుంటారు.అలాంటి జక్కన్నకు అనుకోని కష్టం వచ్చి పడిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్. ప్రస్తుతం రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్ బాబు - ప్రియాంకా చోప్రా కాంబోలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక్కడే రాజమౌళికి కళ్ల నుంచి నీరు కాదు కదా ఏకంగా రక్తమే కారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజమౌళికి ప్రియాంకా చోప్రా ఫీవర్
ఈ సినిమాలో నటిస్తోన్న గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జక్కన్నకు బడ్జెట్ విషయంలో మరో సినిమా చూపిస్తోందట. ముందుగా ఆమె డేట్స్ విషయంలో రాజమౌళికి సెట్ అవడంలేదట.ఇదిలా ఉంటే.. కొన్ని సార్లు అనుకున్న షెడ్యూలుకు ప్రియాంకా చోప్రా రాదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆరోజు బడ్జెట్ మొత్తం గంగపాలే అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రియాంకా చోప్రా షూటింగ్‌లో పాల్గొంటే ఒక్కరోజే కొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందట. అమెరికా నుంచి ఆమె విమానప్రయాణ ఖర్చుల నుంచి స్టార్ హోటల్స్‌లో ఆమె బస, షూటింగ్‌లో పాల్గొని తిరిగి వెళ్లిపోయేవరకు కూడా జక్కన్న కంట్లో రక్తకన్నీరే ఉందని గుసగుసలు నడుస్తున్నాయి.
నిర్మాతకు రక్త కన్నీరే..
ఇండియాలో షూటింగ్ ఉందంటే చాలు... ప్రియాంకా చోప్రా ఎమిరేట్స్ విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణంచేస్తుంది. ఇక ఈ విమానంలో ఖర్చు ఎలాగుంటుందో చెప్పక్కర్లేదు.ఒక్కసారి ఎమిరేట్స్ విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ట్రావెల్ చేస్తే అయ్యే టికెట్ ఖర్చు అక్షరాల రూ.10 లక్షలు. ఇదంతా ఒక సారి రావడానికి మాత్రమే. తిరిగి వెళ్లేందుకు కూడా ఇంచుమించు ఇంతే అవుతుంది. ఇలా షూటింగుల కోసం పలుమార్లు ప్రియాంకా చోప్రా భారత్‌కు వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆమె ప్రయాణ ఖర్చులు, హోటల్ బసకు అయ్యే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయట. ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చింది ఈ డస్కీ బ్యూటీ. అంటే ఇటు జక్కన్నకు అటు నిర్మాతకు నిద్రపట్టలేదనే చెప్పాలి.
ప్రియాంకా చోప్రా బడ్జెట్‌తో చిన్న సినిమా..
ఒక్కసారి భారత్‌లో ల్యాండ్ అయ్యిందంటే ఆమె అకామొడేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఉండాలి కూడా. లగ్జరీ సూట్ రూమ్‌లు,ఆమె ప్రయాణించే కార్లు,సెక్యూరిటీ, స్థానికంగా ఆమెకు చేయాల్సిన మర్యాదలు ఇలా ప్రతి ఒక్కటీ ఖర్చుతో కూడుకున్న పనే. దీనికి తోడు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ ఇంకో లెవెల్‌లో ఉంటుంది.ఇదంతా నిర్మాతకు తలనొప్పి యవ్వారమే అవుతోంది. ప్రియాంకా చోప్రా తెలుగు సినిమాలో అందునా మహేష్ బాబు సరసన నటించడం సినిమాకు అడ్వాంటేజ్ అయినప్పటికీ... ఆమె మెయింటెనెన్స్ విషయంలో మాత్రం నిర్మాతకు తలనొప్పే అని ఇండస్ట్రీ టాక్. అంతేకాదు సినిమాకు అయ్యే బడ్జెట్ పక్కన ఉంచితే కేవలం ప్రియాంకా చోప్రాకు సపరేట్‌గా అయ్యే బడ్జెట్‌తో మరో చిన్న సినిమా తీయొచ్చట.
మరో మార్గం ద్వారా డబ్బులు రాబట్టాలని ప్లాన్
ప్రియాంకా చోప్రా పై అంత బడ్జెట్ ఖర్చు చేసినప్పటికీ ఇదంతా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రాబట్టొచ్చనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఓటీటీలతో ఒప్పందం, ఓవర్సీస్ స్క్రీనింగ్, పలు బ్రాండ్‌లతో జత కట్టడం ద్వారా ప్రియాంకా చోప్రాకు అదనంగా ఖర్చు అయిన డబ్బులను రాబట్టుకోవచ్చని నిర్మాత భావిస్తున్నారట. ఇదిలా ఉండగా... మొత్తానికి ప్రియాంకా చోప్రాకు ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ మహేష్ బాబు - జక్కన్న సినిమాకు కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆమెపై ఎంత ఖర్చు చేసినా అది తిరిగి వస్తుందని వారు చెబుతున్నారు. ఇక రాజమౌళి అంటే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉండటం మరో ప్లస్ పాయింట్.
-
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!












Click it and Unblock the Notifications