మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న.. #SSMB 29 పృథ్విరాజ్ లుక్‌పై ట్రోల్స్ !

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకున్న రాజమౌళి, ఇప్పుడు SSMB 29తో హాలీవుడ్ మార్కెట్‌లో కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా అడ్వెంచర్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ క్లైమాక్స్ సీన్స్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముగ్గురూ పాల్గొంటున్నారని తవిత్తర వేదికగా రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.

pruthviraj-sukumaran-look-released-from-ssmb-29-and-trolls-on-social-media

ఈ మేరకు ఆ పోస్టులో.. భారీ స్థాయిలో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా అద్భుతంగా సాగుతున్నాయి. ఈ వారం మొత్తం SSMB 29 కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ వస్తుంటాయి. ఈరోజే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామని రాసుకొచ్చారు.

కాగా అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చూసిన అభిమానులు ఫుల్ షాక్ అవుతున్నారు. పృథ్వీరాజ్ ఈ సినిమాలో 'కుంభ' అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వీల్ చైర్‌లో కూర్చుని ఉన్న ఆయన లుక్‌ పవర్‌ఫుల్‌గా.. రోబోటిక్ హ్యాండ్స్ కూడా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. నాలుగు చేతుల రాక్షసుడిలా కనిపించే ఈ విలన్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కానీ ఈ లుక్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తున్నాయి. జక్కన్న మళ్లీ కాపీ కొట్టారంటూ పోస్టులు పెడుతున్నారు. పృథ్వీ రాజ్ లుక్.. క్రిష్ 3 సినిమాలో వివేక్ ఒబెరాయ్.. 24 మూవీలో సూర్య వీల్ చైర్ లను పోలి ఉందని అంటున్నారు. అంతే కాకుండా ఆ బ్యాగ్రౌండ్ లో రోబో హ్యాండ్స్ స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఉన్న ఫోర్ హ్యాండ్స్ విలన్ లాగే ఉందని మండిపడుతున్నారు. మరి జక్కన్న టీం ఈ ట్రోల్స్ పై ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.

ఈ సినిమాకు సంబంధించి మహేష్‌ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ వస్తుందనుకుంటే గ్లోబల్‌ ట్రోటర్‌ (Global Trotter) పేరుతో సెమి లుక్‌ని విడుదల చేశారు. బాడీ, మెడలోని ఓ పెండెంట్‌ మాత్రమే చూపించి మరింత ఆసక్తి పెంచారు. ఫుల్‌ లుక్‌ ఎప్పడెప్పుడు వస్తుందా అని అంత ఆశగా వెయిట్‌ చేస్తున్నారు. అయితే నవంబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన తొలి రివీల్ ఉండబోతోంది. దీనిని జక్కన్న కనీవినీ ఎరుగని విధంగా ప్లాన్ చేస్తున్నారు.

pruthviraj-sukumaran-look-released-from-ssmb-29-and-trolls-on-social-media

రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసారం చేసేందుకు జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారా ? లేక టీజర్ లాంటి సర్ప్రైజ్ ఉంటుందా ? అనేది కూడా క్లారిటీ లేదు. ఈ సినిమా తొలి అప్డేట్ కోసమే రాజమౌళి ఇంత ప్లాన్ చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం అవుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మహేష్‌ సరికొత్త లుక్‌లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్‌లో వర్కౌట్‌ చేసి మరింత ఫిట్‌ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+