నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. కానీ అందులోని నటి నటులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి ఆ స్థాయికి చేరుకుంటారు. అయితే వాటిని కొందరు చెప్పుకుంటారు. మరి కొందరు చెప్పుకోలేరు అంతే. అయితే, తాజాగా సీనియర్ నటి పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సీనియర్ నటి పూజిత మీకు గుర్తుందా..? తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 138 చిత్రాల్లో నటించారు. తెలుగులో అయితే దాదాపు 70 సినిమాలకు పైగా నటించి మెప్పించారు. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ చిత్రంతో పాపులర్ అయిన పూజిత.. ఆ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్ కు రెండో భార్యగా నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే రియల్ లైఫ్ లోనూ ఆమె రెండో భార్యగానే మిగిలిపోయారు.

దాదాపు 14 ఏళ్ల పాటు పూజిత, విజయ గోపాల్ లు భార్యాభర్తలుగా తమ దాంపత్య జీవితాన్ని నడిపారు. ఒక బాబు పుట్టిన తర్వాత పూజితను తన భర్త ఇబ్బందులకు గురిచేశాడట. బాబుకు ఏడేళ్లు వచ్చాక విజయ గోపాల్ ఆమెను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని పూజిత తెలిపారు. అంతేకాక "నా మొగుడికి చాలా మందితో*** ఉంది. అతను ఓ రోగ్. కాని నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. అదే రోషం.. అదే పౌరుషం.. అదే నా క్యారెక్టర్.." అని చెప్పుకొచ్చారు. అంతేకాక తన భర్తే తన ఇంట్లో నుంచి దాదాపు రూ.2.5 కోట్ల విలువైన బంగారు అభరణాలు చోరీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications