కొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2 క‌పుల్ సాంగ్‌..

అల్లుఅర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన పుష్ప సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో అంద‌ర‌కీ తెలిసిందే. ఇక‌, ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన విష‌యం విదిత‌మే. ఇక‌, ఈ ఏడాది థియేట‌ర్లోకి రాబోతున్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఏ న్యూస్ వ‌చ్చినా అది నిమిషాల్లో వైర‌ల్ అయిపోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ‌య్యి ప్రేక్ష‌కుల్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా విడుద‌ల‌యిన పుష్ప 2 క‌పుల్ సాంగ్ ఓ కొత్త రికార్డును సృష్టించింది.

ఈ సినిమాలోని సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ అనే క‌పుల్ సాంగ్ ను తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇక‌, ఈ పాట‌లో బ‌న్నీ, రష్మిక తమ స్టెప్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటకి ఇన్ స్టాగ్రామ్ లో లక్ష కి పైగా రీల్స్ వచ్చాయి. ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తో నెట్టంట్లో దూసుకుపోతుంది. గ‌తంలో వ‌చ్చిన పుష్ప సాంగ్స్ హుక్ స్టెప్స్ కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. పుష్ప పాట‌లు దేశం మొత్తం ట్రెండింగ్‌లో న‌డిచాయి. పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌కు దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు.

Pushpa 2 couple song created a new record

ఒకేసారి ఆరుభాష‌ల్లో..

పుష్ప2 లోని పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ ను విడుద‌లయిన కొద్దీరోజుల్లోనే మిలియ‌న్ల వ్యూస్‌ను ఆక‌ర్షించింది. అలాగే, ఇప్ప‌డు ఈ క‌పుల్ సాంగ్ కూడా స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఈ పాట‌ను లెజెండ‌రీ సింగ‌ర్ శ్రేయాఘోష‌ల్ ఆల‌పించారు. ఈ పాట‌ను శ్రేయా మొత్తం ఆరు భాష‌ల్లో పాడ‌టం విశేషం. గ‌తంలో కూడా పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట ఎంతో వైర‌ల్ అయ్యింది. ఆ పాట‌లోని స్టెప్ ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ మ‌రిచిపోలేక‌పోతున్నారు. అదే సినిమాలోని సామీ సామీ సాంగ్ కూడా అంతే. అప్ప‌ట్లో ఎక్క‌డ‌చూసిని ఈ పాట స్టెప్స్ క‌నిపించేవి. ఇన్ స్టా రీల్స్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ఇప్పుడేమో పుష్ప 2 సినిమాలోని క‌పుల్ సాంగ్‌. పుష్పలో క‌నిపించే న‌టులే పుష్ప 2 లో కూడా ఉన్నారు. ఇందులో ఫహాద్ ఫాసిల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ వంటి వారు క‌నిపించ‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+