పుష్ప-2 ఐటం సాంగ్ లీక్.. శ్రీలీల దుమ్ములేపింది..!
సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. తొలుత ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు.

డిసెంబర్ 5న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో సమంత ఐటం సాంగ్ సంగతి తెలిసిందే. ''ఊ అంటావా మామ'' అంటూ సమంత చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో రెండో పార్ట్‌లో ఇలాంటి ఐటం సాంగ్‌నే సుకుమార్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం చాలా మంది పేర్లను అనుకున్నా, 'దేవర'తో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్న జాన్వీ కపూర్‌ని తీసుకుంటారనే టాక్ వినిపించింది. జాన్వీ కపూర్‌తో పాటు, దిశా పటానీ, శ్రద్ద కపూర్ పేర్లు కూడా ఈ లిస్ట్‌లో వినిపించాయి.
Video Na Daggara Undhi ❤️🔥❤️🔥
— 𝙑 𝙆 (@AlluArjunCult09) November 8, 2024
RT & Follow Me I Will DM 😎🔥#Pushpa2TheRuleTrailer pic.twitter.com/jsbyx9UhUf
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరెవ్వర్ని కాకుండా టాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల ఒక్కరే డ్యాన్స్ అదరకొడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శ్రీలీల వైపే మొగ్గు చూపించారు. తాజాగా శ్రీలీల, అల్లు అర్జున్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూస్తే శ్రీలీల, అల్లు అర్జున్ ఇద్దరూ మాస్ స్టేప్పులతో అదరగొడుతున్నట్టు స్పష్టం అవుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ వేసే స్టెప్స్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోవాల్లిపోవడం ఖాయం.












Click it and Unblock the Notifications