పుష్ప-2: చిన్న బిట్టుతోనే పిచ్చెక్కించిన శ్రీలీల
సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత ఐటం సాంగ్ సంగతి తెలిసిందే. ''ఊ అంటావా మామ'' అంటూ సమంత చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో రెండో పార్ట్‌లో ఇలాంటి ఐటం సాంగ్‌నే సుకుమార్ ప్లాన్ చేశారు.

'పుష్ప-2' స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల ఒక్కరే డ్యాన్స్ అదరకొడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శ్రీలీల వైపే మొగ్గు చూపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. 'కిస్ కిసిక్కా' అంటూ సాగే ఈ పాటలో శ్రీలీల దుమ్ములేపింది. 17 సెకన్ల నిడివి గల వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి పాటను 24వ తేదీన(ఆదివారం) విడుదల చేయనున్నారు. డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications