Kissik song:అల్లు అర్జున్-శ్రీలీల మాస్ జాతర.. బాక్సాఫీస్ బద్దలే..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషన్‌వైడ్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత ఐటం సాంగ్ సంగతి తెలిసిందే. ''ఊ అంటావా మామ'' అంటూ సమంత చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో రెండో పార్ట్‌లో ఇలాంటి ఐటం సాంగ్‌నే సుకుమార్ ప్లాన్ చేశారు 'పుష్ప-2' స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల ఒక్కరే డ్యాన్స్ అదరకొడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శ్రీలీల వైపే మొగ్గు చూపించారు.

తాజాగా ఈ పాటను విడుదల చేశారు. 'కిస్ కిసిక్కా' అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల దుమ్ములేపింది. ఇద్దరూ పోటీ పడి డ్యాన్స్ వేసినట్టు ఈ వీడియో సాంగ్ చూస్తే అర్ధం అవుతోంది. ఇక అల్లు అర్జున్-శ్రీలీల ఈ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు థియేటర్ల దగ్గర మాస్ జాతర జరగడం పక్కా అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ''ఊ అంటావా మామ'' పాటకు మించిపోయే రేంజ్‌లో 'కిస్ కిసిక్కా' సాంగ్ ఉంది. ఈ పాటతో దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌లోని మ్యాజిక్ ఏంటో నిరూపించారు. పాట క్యాచీగా ఉండటంతో , బన్నీ హిట్ సాంగ్స్ లిస్ట్‌లో 'కిస్ కిసిక్కా' ఉండటం పక్కా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications