100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప-2 రికార్డ్

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఇక పుష్ప-2 సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తనవైపు తిప్పుకునేలా చేశాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఓవరాల్‌గా 14 రోజుల్లోనే ఈ సినిమా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసింది.

Pushpa-2 record in 100 years history of Bollywood

తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. 100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప-2 కొత్త రికార్డ్ సృష్టించింది. పుష్ప-2 కేవలం 15 రోజుల్లోనే రూ. 632 కోట్ల వసూళ్లను సాధించింది. ఇదే అతిపెద్ద హిందీ నెట్‌గా మారింది.గతంలో ఈ రికార్డ్ శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ-2' పేరిట ఉండేది. ఈ చిత్రం రూ. 625 కోట్లు వసూళ్లను సాధించింది. ఇప్పుడు స్త్రీ-2 క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొడుతూ.. పుష్ప-2 రూ. 632 కోట్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో స్త్రీ-2 సెకండ్ ప్లేస్‌లో వెళ్లింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో పుష్ప-2 హవా మరికొన్ని రోజులు సాగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+