పుష్ప రాజ్ ఆగమనం.. పార్ట్ 3 డేట్ లీక్ చేసిన మైత్రీ ప్రొడ్యూసర్.. !
పుష్ప.. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన స్టార్ హీరో అల్లుఅర్జున్.. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి తమిళ డైరెక్టర్ అట్లీతో అయితే.. మరొకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను ఆనందంతో గెంతులు వేసేలా పుష్ప ప్రొడ్యూసర్ ఓ సెన్సేషనల్ కామెంట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అల్లుఅర్జున్.. తన కంటూ సెపరేట్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కేరళలో మల్లు అర్జున్ గా పేరుగాంచిన బన్నీ.. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో పాగా వేశారు. 2021లో పుష్ప ది రైజ్ అంటూ హిందీ ప్రేక్షకులకు పరిచయమైన బన్నీ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజైన పుష్ప-1 ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో తర్వాత రాబోయే పుష్ప-2 పై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

వీరి అంచనాలను నిజం చేసేలా.. పాన్ ఇండియా రేంజ్ హంగులతో దర్శకుడు సుకుమార్ పుష్ప-2ని తెరకెక్కించారు. ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే పుష్ప-2ని 2024 డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని కొనసాగిస్తూన్నే వచ్చాడు. ఓ వైపు బాలీవుడ్ ప్రేక్షకుల పుష్ప-2కి బ్రహ్మరథం పట్టారు. ఒక్క బాలీవుడ్ లోనే వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. హౌస్ ఫుల్ థియేటర్లతో వరల్డ్ వైడ్ గా పుష్ప-2 1800 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు.
అంతే కాకుండా పుష్ప-3 ర్యాంపేజ్ కూడా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ విషయంపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లుఅర్జున్ మాత్రం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప-3 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సోషల్ మీడియా సైట్లతో పాటు.. ఇంటర్నెట్ లోనూ సెర్చ్ చేస్తున్నారు.
అయితే బన్సీ ఫ్యాన్స్ ఎగిరి గంతెసేలా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. పుష్ప-3 రిలీజ్ డేట్ ను లీక్ చేశారు. నితిన్ హీరోగా రాబోతున్న రాబిన్ హుడ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ పుష్ప-3 2028లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. దీంతో పుష్ప-3 సినిమాపై నెలకొన్న సందిగ్ధతకి తన వ్యాఖ్యలతో రవిశంకర్ తెరదింపారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప-3 ది ర్యాంపేజ్ మాములుగా ఉండదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications