pushpa2: 'పుష్ప2': విడుదలకు ముందు మరో ట్విస్ట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, రష్మిక కథానాయికగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన చిత్రం పుష్ప2. పుష్ప1కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీమూవీ మేకర్స్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తరాదిలో ఈ సినిమా మేనియా కనిపిస్తోంది. అక్కడి ప్రేక్షకులు అత్యంత ఆత్రుతగా పుష్ప2 కోసం ఎదురు చూస్తున్నారు.
3డి షోలు రద్దవుతాయా?
ఈ తరుణంలో సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి 3డి వెర్షన్ సిద్ధం కాలేదని, ప్రస్తుతానికి 2డి వెర్షన్ మాత్రమే సిద్ధమైందని తెలిపాడు. ఒకవేళ ప్రేక్షకులు 3డి వెర్షన్ లో చూద్దామని టికెట్లు బుక్ చేసుకుంటే ఆ షోలు రద్దవుతాయని తెలిపాడు. అలా కాకుండా చూడాలనుకుంటే అదే థియేటర్ లో 2డి వెర్షన్ ప్రదర్శిస్తారని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతానికి పుష్ప2 సినిమాకు సంబంధించి కేవలం 2డి వెర్షన్ మాత్రమే సిద్ధమైంది. థియేటర్ ప్రింట్ ను ఒకటికి రెండుసార్లు నిర్మాతలు, దర్శకుడు చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా లోపాలుంటే సరిచేయాలని భావిస్తున్నారు.

ఏడు భాషల్లో విడుదల
2డి, 3డి, డాల్బీ, ఐమ్యాక్స్, ఐస్, డిబాక్స్, 4డీఎక్స్ వెర్షన్స్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే పనులన్నీ పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్లలో 2డి వెర్షన్ మాత్రమే విడుదల చేస్తున్నారు. ఏమైనా చిన్న చిన్న మార్పుచేర్పులు ఉంటే ఈరోజు రాత్రికల్లా పూర్తిచేయాలని సుకుమార్ కష్టపడుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడం, బెంగాలీ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఫాహద్ ఫజిల్, రావు రమేష్, జగపతిబాబు, అనసూయ, సునీల్, అజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దేవిశ్రీ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అవుతోంది. బీజీఎం నచ్చలేదని తమన్ చేత చేయించినప్పటికీ, అది నచ్చలేదని తిరిగి దేవిశ్రీతో మంచి బీజీఎంను సుకుమార్ రాబట్టుకున్నాడని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications