pushpa2: షో పడకుండానే 'కల్కి' రికార్డును బద్ధలు కొట్టిన 'పుష్ప2'!

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం పుష్ప2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, రష్మిక కథానాయికగా నటించారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అని చూస్తున్న వారి కోరిక మరో 24 గంటల్లో నెరవేరబోతోంది. దక్షిణాదికన్నా ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. చిత్ర యూనిట్ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే పాన్ ఇండియాలో తిరుగులేని హీరోగా అల్లు అర్జున్ ఆవిర్భవించబోతున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కల్కి రికార్డు బద్దలే
ఇంతవరకు ఎక్కడా సినిమా ప్రదర్శించకుండానే కొత్త రికార్డును నెలకొల్పడమే కాకుండా కల్కి, బాహుబలి, కేజీఎఫ్, సలార్ రికార్డులను బద్దలు కొట్టేసింది. బుక్ మై షోద్వారా 10లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయి, కేవలం టికెట్ల అమ్మకంద్వారానే రూ.100 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా సంచలన రికార్డు. సినిమా విడుదలైతే మొదటిరోజు రూ.100 కోట్లు సాధించాలని స్టార్ హీరోలంతా లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే టికెట్లద్వారానే రూ.100 కోట్లు రావడంతో ఈ సినిమా తొలిరోజు రూ.250 నుంచి రూ.350 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం ముగిసేసరికి రూ.700 కోట్లు, మొదటి వారానికి రూ.వెయ్యి కోట్లు రాబడుతుందంటున్నారు.

pushpa2 movie beat prabhas kalki movie record before not show the movie

రూ.2వేల కోట్లు రాబడుతుందని అంచనా
లాంగ్ రన్ లో పుష్ప2 చాలా సులువుగా రూ.2వేల కోట్లు రాబడుతుందని, అందరూ వెయ్యి కోట్ల రూపాయలే సాధించడం గగనం అనుకుంటున్న తరుణంలో పుష్ప2ద్వారా అల్లు అర్జున్ చాలా సులువుగా రూ.2వేల కోట్లు రాబట్టబోతున్నాడంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, హిందీలో ఈ సినిమా తొలిరోజే రూ.80 కోట్ల నెట్ వసూళ్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాద్వారా తిరుగులేని పాన్ ఇండియా హీరోగా బన్నీ మారబోతున్నాడని, తర్వాత చేసే సినిమాపై అంచనాలు ఇంకా భారీగా ఉంటాయంటున్నారు. షో పడకుండానే ఇంతకుముందు భారీగా విడుదలైన భారీ చిత్రాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తున్న పుష్ప2 భవిష్యత్తులో మరెన్ని రికార్డులను బద్దలు కొట్టనుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+