స్టూడెంట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే ???
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు "ఆర్.మాధవన్". లవర్ బాయ్ ఇమేజ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత విభిన్న పాత్రలతో నటుడిగా తన పరిధిని విస్తరించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం హిందీతో పాటు పలు భాషల్లో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు.
సినీ కెరీర్..
కాగా మాధవన్ 2000లో విడుదలైన Alaipayuthey సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే భారీ గుర్తింపు పొందారు. చాక్లెట్ బాయ్ లుక్స్, సహజమైన నటన యువతను ఆకట్టుకుని ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చాయి. తర్వాత Minnale చిత్రం ఆయన కెరీర్‌కు మలుపు తిప్పింది. ఈ సినిమాతో దక్షిణాదిలో క్రేజ్ పెరగడంతో పాటు రొమాంటిక్ హీరోగా స్థిరపడ్డారు. అదే చిత్రానికి తెలుగు రీమేక్ అయిన Sakhi ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలానే 3 Idiots, Tanu Weds Manu, Vikram Vedha వంటి చిత్రాలు ఆయనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చాయి.

రీసెంట్ గానే శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన Rocketry The Nambi Effect చిత్రంతో నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన Dhurandhar చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్టూడెంట్ తో ప్రేమవివాహం..
అయితే మాల్లోకి రాకముందు మాధవన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థులకు కమ్యూనికేషన్, స్కిల్ మేనేజ్‌మెంట్ శిక్షణ ఇచ్చేవారు. ఈ సమయంలోనే ఆయన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొని యువతలో మంచి గుర్తింపు సంపాదించారు. మోడలింగ్ మరియు టెలివిజన్ షోల ద్వారా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి. క్షణ తరగతుల సమయంలో విద్యార్థిని అయిన Sarita Birjeను మాధవన్ కలుసుకున్నారు. పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని 1999లో వివాహం చేసుకున్నారు.
ఇక కోర్సు పూర్తి చేసిన తర్వాత సరిత ఎయిర్ హోస్టెస్‌గా ఎంపిక కావడం వారి జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దంపతులకు కుమారుడు Vedaant Madhavan ఉన్నారు. వేదాంత్ ఈతలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధిస్తూ కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.
-
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ ! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్












Click it and Unblock the Notifications