సీతకు విడాకులు..24 ఏళ్లుగా సింగిల్‌గానే.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే

కోలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్, నిర్మాత, నటుడు ఆర్‌. పార్తీబన్‌ 90వ దశకంలో ఆనాటి అగ్రతారలకు పోటీగా నటించి మెప్పించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశాడు. వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా పని చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

"నా దర్శకత్వంలో చేయడానికి హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులలో నేనే హీరోగా మారాను. ఆ సినిమాలో సీత నటించారు. అప్పటికే ఆమె హీరోయిన్ గా 50 సినిమాలు చేశారు. ఆ సినిమా సమయంలోనే మేము ప్రేమించుకోవడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. నేను సీతను ప్రేమించడం పెద్ద విషయం కాదు. కానీ ఆమె నన్ను ఇష్టపడటం గొప్ప విషయమని నేను చెబుతూ ఉంటాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లయిన పదేళ్ల తరువాత మేము విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను' అని అన్నారు.

R Parthiban Opens Up About His Personal Life in a Candid Interview

ఇంకా సింగిల్‌గానే..

అయితే తాను ఇప్పటికీ సీతను గౌరవిస్తానని.. ప్రేమిస్తానని.. అందుకే 24 ఏళ్లయినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా సింగిల్‌గానే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ఇక పార్తీబన్‌ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇతడు ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 వంటి పలు చిత్రాల్లో పార్తీబన్ నటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+