'రాకా' మూవీ కథేంటో తెలిసొచ్చేసింది: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుస లీకులు!

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న 'రాకా' సినిమాపై ఇప్పటివరకు అత్యంత రహస్య వాతావరణం నెలకొంది. సినిమాకు సంబంధించిన వివరాలను గుట్టుగా ఉంచేందుకు చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఊహించని విధంగా రోజుకో కీలక లీక్ బయటకు వస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Kamal Haasan: కత్తి పట్టిన కమల్ హాసన్.. ఇక బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చే
Kamal Haasan: కత్తి పట్టిన కమల్ హాసన్.. ఇక బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చే

వరుస లీకులతో విపరీతమైన బజ్
ఇటీవల వినిపించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఓ గర్భిణి పాత్రలో కనిపిస్తుందని.. ఆమెకు రక్షకురాలిగా రష్మిక మందన్న నటించనుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా కథలోని వేర్వేరు టైమ్‌లైన్స్‌లో అల్లు అర్జున్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని వరుస అప్‌డేట్లు వెలువడ్డాయి. అత్యంత రహస్యంగా భావిస్తున్న ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టు నుంచి ఈ స్థాయిలో పాత్రలు, కథాంశానికి సంబంధించిన వివరాలు వరుసగా బయటకు రావడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Raaka Movie Leaks Controversy Allu Arjun and Atlee Movie Story Out Is it a marketing strategy

నిజమైన లీకులా? పక్కా మార్కెటింగ్ వ్యూహమా?
ఈ వివరాలన్నీ నిజమైన లీకులేనా, లేక ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందమే వ్యూహాత్మకంగా బయటకు విడుదల చేస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ లీకులపై మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. చిత్ర పరిశ్రమలో దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఓ అత్యంత క్రేజీ ప్రాజెక్టును నిరంతరం వార్తల్లో ఉంచడానికి, ప్రేక్షకులు, అభిమానుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేయడానికి కొన్ని విషయాలను లీక్ చేయడం నేటి మార్కెటింగ్ ట్రెండ్స్‌లో ఓ భాగంగా మారిపోయింది.

శ్రీకృష్ణదేవరాయలుగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..!
శ్రీకృష్ణదేవరాయలుగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..!

నిజంగానే ఇది చిత్రబృందం ప్లాన్ చేసిన మార్కెటింగ్ గేమ్ లో భాగమా లేక భద్రతా లోపం వల్ల వచ్చిన లీకులా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే కారణమేదైనా.. ఈ వార్తలు మాత్రం 'రాకా' సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+