రామ్ చరణ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఏంటి ఇలా అయిపోయాడు?
చాలా మంది కొత్త డైరెక్టర్స్ కు పెద్ద హీరోలతో ఒక్క సినిమా అయినా తీయాలని కలలు కంటూ ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పాన్ ఇండియా స్టార్స్ తో ఒక్క అవకాశం వచ్చినా చాలు.. టాలెంట్ నిరూపించుకోవడానికి అని ఉవ్విళ్లూరుతుంటారు. చేతిలో సాలిడ్ స్క్రిప్ట్ ఉన్నా పెద్ద పెద్ద హీరోల దగ్గరికి వెళ్లాలంటే చాలా మందికి ఆ స్టోరీ వినిపించాల్సి ఉంటుంది. అందిరినీ సంతృప్తి పరిస్తేనే బడా హీరోల దగ్గరకు వెళ్తారు.
అలా ఏకంగా మెగా పవర్ స్టార్.. ఇప్పటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్.. ఇప్పుడెలా ఉంటారని మీరు అనుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాడని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎలా అయిపోయాడో తెలుసా? అసలు చేతిలో సినిమాలు లేని పరిస్థితి.. నమ్మి సినిమా సినిమా చేతిలో పెట్టే నిర్మాత కరువై పోయాడు. మరి ఇంతకీ ఎవరా డైరెక్టర్?
సంపత్ నంది.. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది మంది డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన తొలి సినిమా ఏమైంది ఈవేళ. ఈ మూవీ 2010లో రిలీజై మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. తొలి సినిమాతోనే సంపత్ నంది హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దృష్టిలో పడ్డాడు. సంపత్ నంది చెప్పిన కథ.. చెర్రీకి నచ్చడంతో ఓకే చెప్పాడు. అదే రచ్చ. రచ్చ సినిమా 2012లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ రచ్చ రచ్చ చేసింది. అప్పట్లోనే ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా నిరూపించింది.
ఇక ఇదే సంపత్ నంది చివరి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అవును ఆ తర్వాత రవితేజతో తీసిన బెంగాల్ టైగర్, గోపిచంద్ తో తీసిన గౌతమ్ నందా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. హిట్ టాక్ తెచ్చుకోలేక చతికిల పడ్డాయి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 2021లో మళ్లీ గోపిచంద్ తో మళ్లీ సీటీమార్ అనే సినిమా తీశాడు. అది కూడా హిట్ కాలేదు. ఇక ఇదే ఆయన డైరెక్ట్ చేసిన చివరి సినిమా కావడం గమనార్హం.

ఇటీవల రిలీజైన ఓదెలా 2 మూవీకి రచయితగా వ్యవహరించాడు సంపత్ నంది. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో సంపత్ నంది ఏంటి ఇలా అయిపోయాడు అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రామ్ చరణ్ కే సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు.. కనీసం సినిమాలు తీసే పరిస్థితిలో లేకపోవడం ఏంటోనని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications