'మూడు నెలల గర్భంతో ఉన్నా.. ఆ నిర్మాత వదల్లేదు'.. నటి రాధికా ఆప్టే సంచలనం
రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నటి రాధికా ఆప్టే. అయితే బాలకృష్ణ 'లెజెండ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం 2015లో విడుదలైన లయన్ తర్వాత ఆమె టాలీవుడ్ కు దూరంగా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసింది. గతేడాది మెర్రీ క్రిస్మస్, సిస్టర్ మిడ్‌నైట్ సినిమాలు చేసింది. ఇక 2012లో బ్రిటీష్ కంపోజర్ బెనెడిక్ట్ టేలర్ ను ఆమె ప్రేమించి పెళ్లాడింది. అయితే రాధికా ఆప్టే మూడు నెలల గర్భంతో ఉన్న సమయంలో ఓ సినిమా నిర్మాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శారీరకంగా.. మానసికంగా కష్టకాలంలో సహకారం లేకపోవడంపై ఆమె బాధ పడింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించిన రాధికా ఆప్టే.. గతేడాది డిసెంబరులో బిడ్డకు జన్మనిచ్చింది.
తాజాగా నేహా ధూపియా నిర్వహిస్తోన్న ఫ్రీడమ్ టు ఫీడ్ లైవ్ సెషన్ కు హాజరైన రాధికా ఆప్టే తాను గర్భం ధరించాక ఎదురైన అనుభవాలను పంచుకుని ఎమోషనల్ అయింది. తాను గర్భంతో ఉన్నప్పటికీ సెట్ లో ఎలాంటి సానుభూతి చూపలేదని బాధపడింది. మొదటి మూడు నెలల్లో తనకు నరకంలా షూటింగ్ అనిపించిందని పేర్కొంది. ఆ సమయంలో ఓ నిర్మాత తనతో వ్యవహరించిన తీరుతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఆ నిర్మాతకు నేను గర్భం ధరించడం ఇష్టం లేదనుకుంటా.. నాకు చాలా అసౌకర్యం, ఇబ్బందిగా ఉందని చెప్పినా బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలని పట్టుబట్టాడని పేర్కొంది.

ప్రెగ్నెంట్ అయిన మొదటి మూడు నెలలు బాగా తినడం వల్ల నా శరీరంలో విపరీతమైన మార్పులొచ్చాయి. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోకపోవడంతో ఫీల్ అయ్యా. షూటింగ్ సెట్ లో నొప్పితో ఉన్నప్పుడు వైద్యుడిని కలిసేందుకు కూడా నన్ను అనుమతించలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. వృత్తి పరంగా నిబద్ధతగా ఉండాలని తెలుసు. కానీ ఇలాంటి టైమ్ లో కొంచెం సానుభూతి కూడా అవసరం అని తన బాధను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications