షాకింగ్ పోస్ట్: సమంత పెళ్లిపై తొలిసారి స్పందించిన రాజ్ మాజీ భార్య!
ప్రముఖ హీరోయిన్ సమంత రుతు ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహం చేసుకున్నప్పటి నుంచి రాజ్ మాజీ భార్య శ్యామలీ డే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సమంత కారణంగానే రాజ్, శ్యామలీల బంధం విచ్ఛిన్నమైందని.. సమంత 'హోమ్ బ్రేకర్' అని ఆరోపిస్తూ కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో శ్యామలీ డే పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ మొత్తం వివాదంపై శ్యామలీ డే తొలిసారిగా స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మౌనం వీడిన శ్యామలీ డే
శ్యామలీ డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వరుస పోస్టులు పెడుతూ.. శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పింది. అదే సమయంలో ఈ వివాదం నుంచి తనను దూరంగా ఉంచాలని అభ్యర్థించింది. "నేను రాత్రంతా నిద్రపోలేదు. ధ్యానం అంటే తల్లి భూమి, ప్రజలు,జీవులందరికీ శాంతి, ప్రేమ, క్షమ, ఆశ, కాంతి, సంతోషం, సామరస్యం, మంచి కర్మలు కలగాలని ఆశీర్వదించడం. నాకు ఇప్పుడు లభిస్తున్న ఈ మద్దతు అంతా నేను ఇచ్చిన శక్తి తిరిగి నా దగ్గరికి రావడమే అని ఒక స్నేహితుడు గుర్తు చేశారు."

"నవంబర్ 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ అని తెలిసింది. ఆ క్యాన్సర్ మెదడు నుంచి శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించింది. నా దృష్టి ప్రస్తుతం ఎక్కడ ఉండాలో మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఈ 'స్పేస్'ను శుభ్రంగా ఉంచాలని నేను అత్యంత వినయంగా అభ్యర్థిస్తున్నాను. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి మంచి ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత లభించాలని ఆశిస్తున్నాను." అని శ్యామలీ డే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
మీడియా కవరేజ్, సింపతీ వద్దు!
మరో పోస్ట్‌లో శ్యామలీ డే చాలా స్పష్టంగా తన మనసులోని మాటను చెప్పారు. "ఎవరైనా డ్రామా లేదా బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తుంటే, అది మీకు ఇక్కడ దొరకదు. నన్ను వదిలేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. నాకు ఎలాంటి అటెన్షన్, మీడియా కవరేజ్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్ లేదా సానుభూతి అవసరం లేదు. నేను ఇక్కడ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు." అని శ్యామలీ డే పేర్కొన్నారు. శ్యామలీ డే ప్రకటనతో తన దృష్టి ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం, గురువు ఆరోగ్యంపై ఉందని, మీడియా దృష్టి లేదా ట్రోలింగ్ తమ బంధం గురించి డ్రామా సృష్టించవద్దని ఆమె కోరినట్లు స్పష్టమవుతోంది.
ఎవరు ఈ శ్యామలీ డే?
శ్యామలీ డే కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆమె రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'రంగ్ దే బసంతి', 'ఓంకార' వంటి ప్రముఖ ప్రాజెక్టులలో ఆమె భాగమయ్యారు. శ్యామలీ, రాజ్ 2015లో వివాహం చేసుకున్నారు. నివేదికల ప్రకారం.. 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే వారి వివాహం లేదా విడాకుల గురించి ఇద్దరూ మీడియాకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్యామలీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇప్పటికీ రాజ్‌తో ఉన్న పాత ఫోటోలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications