ఆ ఇద్దరూ.. తాము చెప్పిన మాట వినకపోతే రాజమౌళిని కూడా తాట తీస్తారు..

తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రాంతీయ సరిహద్దులు దాటించి, అంతర్జాతీయస్థాయి వేదికలపై సగర్వంగా నిలబెట్టిన అసాధారణ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా లేని ఈ మేరునగధీరుడు తెలుగుకే పరిమితమైన హీరోలను అంతర్జాతీయ స్టార్లుగా మార్చారు. ప్రభాస్‌ను 'బాహుబలి'గా, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ హీరోలుగా మార్చి, వారి ఇమేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చారు. రాజమౌళి విజయం వెనుక ఆయన కుటుంబం సైన్యంలా పనిచేయడంతోపాటు ఎప్పుడూ వెన్నంటి నిలుస్తుంది.

వారంతా సైన్యంలా పనిచేస్తారు

తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథలను అందిస్తారు. సోదరుడు కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూరుస్తారు. ఈ రెండు రాజహౌళి సినిమాలకు వెన్నెముకలాంటివని చెప్పొచ్చు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం ఆస్కార్, గ్రామీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయగా తలెత్తుకునేలా చేసింది. సినిమా నిర్మాణంలో రాజమౌళి కుటుంబ సభ్యుల పాత్ర అమూల్యం.

Rajamouli could even get beaten if he refuse to follow these two people instructions

ఆయన భార్య రమ రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా నటీనటుల రూపకల్పన చూసుకుంటే, కీరవాణి భార్య వల్లి ప్రొడక్షన్ వ్యవహారాలను అత్యంత క్రమశిక్షణతో చూసుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోరు. చాలా కఠినంగా వ్యవహరిస్తారు. వీరిద్దరితో పాటు రాజమౌళి, కీరవాణిల కుమారులు కూడా సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాల్లో బాధ్యతలు పంచుకుంటూ, అంతిమంగా రాజమౌళి సినిమా సంచలన విజయం సాధించడానికి దోహదపడతారు.

వినకపోతే తాట తీస్తారు

పని విషయంలో రాజమౌళి ఎంత కఠినంగా ఉంటారో, ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తారు. షూటింగ్ సమయంలో బంధుత్వాలకు తావు లేకుండా వృత్తికే దర్శక ధీరుడు ప్రాధాన్యత ఇస్తారు. అయితే విరామ సమయాల్లో మాత్రం అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్తూ, అనుబంధాలను, ఆప్యాయాతలను కాపాడుకుంటారు. ఈ క్రమశిక్షణే వారిని చిత్ర పరిశ్రమలో ఒక ఆదర్శ కుటుంబంగా నిలబెట్టింది. వృత్తిపరంగా రాజమౌళి ఎంతటి గొప్ప విజయాలు సాధించినా, వ్యక్తిగత జీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటారు.

దీనికి కారణం వారి ఇంట్లోని మహిళలేనని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇంట్లో పెత్తనం అంతా రమ, వల్లిలదేనని.. వారు చెప్పినట్లు వినకపోతే తమ 'తాట తీస్తారని' రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. తాము ఇంత సింపుల్‌గా ఉండటానికి, గర్వానికి పోకుండా ఉండటానికి కారణం ఆ ఇద్దరు మహిళలేనని ఆయన కృతజ్ఞతగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+