బ్రేకింగ్: రాజశేఖర్ ఇంట్లో... పెళ్లి చేసుకొని రూ.15 లక్షలకు పరార్
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సినిమాల్లో విలన్ గా వచ్చిన అవకాశాలను వద్దనుకొని హీరోగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గరుడవేగ తర్వాత వచ్చిన సినిమాలేవీ హిట్ కాలేదు. తాజాగా మరో చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇటువంటి సమయంలో రాజశేఖర్ ఇంట్లో షాకింగ్ సంఘటన జరిగింది. వారి ఇంట్లో పనిచేయడానికి విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ పనికి కుదిరింది. కొన్ని సంవత్సరాలుగా వారి ఇంట్లోనే పనిచేస్తోంది. అలాగే విశాఖపట్నంకు సమీపంలోని కొత్తవలస మండలంలోని సూరివలస ప్రాంతానికి చెందిన వ్యక్తి రాజశేఖర్ కారు డ్రైవర్ గా పనికి కుదిరాడు.
రూ.15 లక్షలు తీసుకొని పరారయ్యాడు
కారు డ్రైవర్ గా పనిచేస్తూ రాజశేఖర్-జీవిత ఇంట్లో పనిచేస్తున్న మహిళపై కన్నేశాడు. ఆమెకు వివాహమైనప్పటికీ భర్తతో విభేదాలు రావడంతో వేరుగా ఉంటోంది. దీంతో మాయమాటలతో ఆమెను మభ్యపెట్టి ప్రేమిస్తున్నట్లు కారు డ్రైవర్ నటించాడు. పెళ్లిచేసుకుంటానని, కలిసి జీవిద్దామని నమ్మించాడు. క్రమంగా అతనితో చనువు పెరగడంతో ఆ మహిళ తన బంగారాన్ని సైతం అమ్మేసి కారు డ్రైవర్ కు ఇచ్చింది. అలాగే ఖరీదైన ఫోన్ కొనుక్కుంటానంటే దానికీ డబ్బులిచ్చింది. తర్వాత కారు డ్రైవర్ ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న రూ.15 లక్షలు తీసుకొని పరారయ్యాడు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ మహిళ జరిగిన విషయాన్ని జీవితకు, రాజశేఖర్ కు వివరించింది. దీంతో రాజశేఖర్ దగ్గరుండి ఆ మహిళతో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కారు డ్రైవర్ పై కేసు పెట్టించాడు. పెళ్లి చేసుకొని తర్వాత మోసం చేసి డబ్బుతో, బంగారంతో పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దొరసాని చిత్రం ద్వారా పరిచయం
దొరసాని చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన రాజశేఖర్-జీవిత కుమార్తె శివాత్మిక తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ పరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తర్వాత తెలుగులో రంగమార్తాండ, పంచతంత్రం లాంటి సినిమాలు కూడా చేసిందికానీ అనుకున్నస్థాయిలో పేరు సంపాదించుకోలేకపోయింది. అందంతోపాటు మంచి అభినయం ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు అంగీకరించకుండా ఏ తరహా చిత్రాలు చేయాలా? అనే ఆలోచనలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటూ తనకు సంబంధించి ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?










Click it and Unblock the Notifications