చిరంజీవి లాంటి స్టార్ హీరోకు క్లాస్ తీసుకున్న హీరో
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. దీన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. దీనిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిరంజీవి అందరూ యువ దర్శకులకే అవకాశం ఇస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే నచ్చితే చాలు వారు అగ్ర దర్శకులా, గతంలో భారీ సినిమాలు తీశారా? బ్లాక్ బస్టర్లు ఇచ్చారా? అనే విషయాలను పట్టించుకోవడంలేదు.
దీనికి కారణం దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక సందర్భంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తాను యువ దర్శకులకు అవకాశం ఇవ్వడమనేదానికి ప్రధాన కారణం రజనీకాంత్ అని చెప్పారు. బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య చేస్తే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు వసూళ్లు వచ్చాయి. రజనీ చిరుతో మాట్లాడుతూ ఒకప్పుడు అగ్ర దర్శకులతో సినిమాలు చేశామని, కానీ వారెవరూ ఇప్పుడు సినిమాలు చేయడంలేదని, సినిమాలు తీసేవారంతా కుర్రకారే ఎక్కువగా ఉన్నారని రజనీ చిరంజీవితో అన్నారు.

వారంతా అభిమానులేనని, వారైతే తమ అభిమాన హీరోను ఎలా చూపించాలో? ఎలా సినిమా తీస్తే బాగుంటుందో అనే ఐడియా వారికి ఉంటుందని, దీనివల్ల సినిమా బాగా రావడానికి అవకాశం ఉంటుందని చిరంజీవితో చెప్పారు. దీంతో రజనీకి చిరు బదులిస్తూ అందుకే తాను బాబీకి అవకాశం ఇచ్చానని, వాల్తేర్ వీరయ్య తీశాడని, అలాగే ఇప్పుడు వశిష్టకు అవకాశం ఇచ్చానని విశ్వంభర తీస్తున్నాడని చెప్పారు. లెజండరీ దర్శకులు ఇప్పుడు లేకపోయినా యువ దర్శకులకు, కొత్త దర్శకులకు అవకాశాలిస్తుండాలని, దీనివల్ల మనల్ని ఎలా చూపిస్తే బాగుంటుందో వారికి ఒక అవగాహన ఉంటుందని, ఇదే పద్ధతిని కొనసాగించమని రజనీ చిరుకు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications