'ధురంధర్ 2' రికార్డులు అవుట్.. రజనీకాంత్ వేట షురూ!
భారతీయ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 75 ఏళ్ల వయసులోనూ ఆయన సరికొత్త కలెక్షన్స రికార్డులు సృష్టిస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ఆయన హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఈ ఏడాది వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ధురంధర్ 2: ది రివెంజ్' రికార్డులను కూడా 'జైలర్ 2' సినిమా బ్రేక్ చేసింది.
4 రోజుల్లోనే రూ.424 కోట్లు
'జైలర్ 2' తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.424.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజే రూ.59.70 కోట్ల అద్భుతమైన ఓపెనింగ్ తో ప్రయాణించిన ఈ చిత్రం.. శుక్రవారం కొద్దిగా తగ్గినా.. శని, ఆదివారాల్లో ఊహించని రేంజ్ లో పుంజుకుంది. ఒక్క ఆదివారం నాడే ఇండియాలో రూ.55.85 కోట్ల నెట్ సాధించింది. ప్రస్తుతం ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్ రూ.199.90 కోట్లకు(గ్రాస్ రూ.234.25కోట్లు) చేరుకోగా.. ఓవర్సీస్ నుంచి దాదాపు రూ.190 కోట్ల భారీ మార్జిన్ వసూలైంది.

'ధురంధర్ 2' ఓవర్సీస్ రికార్డు ఖతం
ఓవర్సీస్ వసూళ్ల విషయంలో రజనీకాంత్ 'ధురంధర్ 2'ను దాటేశారు. 2026లో విదేశీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన భారతీయ సినిమాగా 'జైలర్ 2' సరికొత్త రికార్డు నెలకొల్పింది. విదేశాల్లో తొలిరోజు 'జైలర్ 2' దాదాపు రూ.57 కోట్లు రాబట్టగా.. 'ధురంధర్ 2' రూ.52 కోట్లతో రెండో స్థానానికి పడిపోయింది. గతంలో 'ధురంధర్ 2' నార్త్ అమెరికాలో ఏకంగా 25 మిలియన్ డాలర్లు(రూ.240 కోట్లు) వసూలు చేసి 'బాహుబలి 2' రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆ స్థాయి సుదీర్ఘ లాంగ్ రన్‌ను 'జైలర్ 2' కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
నెక్స్ట్ టార్గెట్ రూ.500 కోట్లు
అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన నేపథ్యం సంగీతం, నెల్సన్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ , రజనీకాంత్ మార్క్ స్వాగ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. వీకెండ్ ముగిసేనాటికే దాదాపు రూ.425 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా చాలా సులభంగా రూ.500 కోట్ల మార్కును చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. రజనీకాంత్ 'జైలర్ 2' దెబ్బకు ఇతర సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.













Click it and Unblock the Notifications
