టీజర్ కే సుస్సు పడుతోంది.. ఇక సినిమా రిలీజ్ అయితే..!
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ మాడ్, మాడ్ స్క్వేర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సంగీత్ శోభన్ లేటెస్ట్ మూవీ 'రాకాస' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఓవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ అలరిస్తోంది. ఈ మూవీని మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3, 2026 న రాకాస మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
మ్యాడ్ సినిమా ఫేమ్ సంగీత్ శోభన్ తొలిసారిగా సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'రాకాస'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 3, 2026 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ మూవీలో 'ఆయ్', 'విష్ణు విన్యాసం' ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీని మెగా డాటర్ నీహారిక నిర్మిచింది. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఓ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్ విషయానికి వస్తే.. 'నరకం నుంచి సందేశం వస్తుంది' అలాగే 'మన ఊరి శాపం ఇది' అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. టీజర్ ప్రారంభం నుంచే ఆకట్టుకుంటోంది. ఓ పాడుపడిన భవనంలోకి హీరో, హీరోయిన్, వాళ్ల ఫ్రెండ్ వెళ్లడం, అక్కడ జరిగే ఘటనలు, భూత వైద్యుల సన్నివేశాలు భయపెడుతున్నాయి. మొత్తంగా టీజర్ చూస్తుంటే 'కమిటీ కుర్రాళ్లు' తర్వాత నీహారికకు మరో విజయం ఖాయం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications