డబ్బు ఇస్తే తమన్నా ఆ పని కూడా చేస్తోంది.. హీరోయిన్ సంచలన కామెంట్స్
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్ర కారుకు చెమటలు పట్టించింది. ఇటీవలే రైడ్-2 సినిమాలో మరో ఐటమ్ సాంగ్‌తో అమ్మడు మెరిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటించారు.
ఇటీవల ఈ సినిమాలోని ఐటం సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో తమన్నా తనదైన శైలిలో అందాలను ఆరబోసింది. ఇంకా చెప్పాలంటే కాస్తా ఓవర్‌గానే తన ఎద అందాలను ప్రదర్శించింది తమన్నా. తన ప్రైవేట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. తాజాగా దీనిపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆమె తమన్నాపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
చాలా గ్యాప్ తర్వాత రాఖీ సావంత్ తిరిగి నటించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ సందర్భంగా ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం తమన్నాననే అని ఆమె అభిప్రాయపడ్డారు.తమన్నా మా కడుపు కొడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కోట్లు తీసుకుని హీరోయిన్‌గా స్టార్ డమ్ అందుకున్న తమన్నా.. ఇప్పుడు ఎందుకు ఐదు లక్షలకే ఐటం సాంగ్స్ చేస్తుందని ప్రశ్నించింది. విలువలు లేకుండా ఉండకూడదని తమన్నానని ఉద్దేశించి రాఖీ చెప్పుకొచ్చింది. అయితే చివర్లో మాత్రం తమన్నాతో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాఖీ సావంత్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications