హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్ ఇవ్వడంపై రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ కామెంట్స్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ బ్యూటీ. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడింది. కోలీవుడ్, బాలీవుడ్‌ల్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు.
దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుక పడిపోయింది. ఫొటోషూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు గతేడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. తాను హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ఇల్లు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ ఇల్లుపై అనేక ఆరోపణలు వినిపించాయి. పొలిటికల్ లీడర్స్ ఆమెకు ఈ ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చారనే ఆరోపణలు వినిపించాయి. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు రకుల్.
Is it a weird Rumour??? pic.twitter.com/ScJ5Rke1OD
— Vijaypal Reddy (@VijaypalReddy12) June 1, 2025
ఈ పుకారు తన తండ్రికి తెలిసి, తీవ్ర ఆగ్రహానికి గురై పెద్ద రచ్చ చేశారని రకుల్ వెల్లడించారు. దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారని తెలిపింది. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి, ఒక్కో రూపాయి పోగు చేసి ఈ ఇల్లు కొన్నానని, కానీ తన ఇంటిపై ఇలాంటి రూమర్ రావడం ఏంటని తన తండ్రి ఫైర్ అయ్యారని ఆమె తెలిపారు.
ఈ విషయంలో రకుల్ తన తండ్రిని కూల్ చేశారట. ఇలాంటి చెత్త రూమర్స్ వస్తుంటాయి, వాటిని పట్టించుకోవద్దని తండ్రికి చెప్పినట్టు వెల్లడించారు. మనం రియాక్ట్ అయితే వాళ్లు హైలైట్ అవుతారు. సైలెంట్‌గా ఉండటమే బెటరని తండ్రిని శాంతింపజేశారట. ఇలా హైదరాబాద్‌లో ఉన్న ఇల్లును కష్టపడి కొన్నామని రకుల్ వివరణ ఇచ్చింది.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications