ఆఫర్ల కోసం ఇంత దిగజారాలా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. అయితే కొందరు సోషల్ మీడియాలో అతిగా ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. మరికొందరైతే ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా ఓ హీరోయిన్ సరిగ్గా ఇలాంటి పనే చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు.

దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుక పడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా ఫలితం లేకపోయింది. రకుల్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'భారతీయుడు 2' తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'దే దే ప్యార్ దే 2' సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రకుల్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే గ్లామర్ డోస్ కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక స్టెప్పులో అజయ్, రకుల్ ఛాతీపై వాలి డ్యాన్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వయసులో వివాహిత నటితో ఇంత అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలా? అంటూ అజయ్ దేవగన్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
Rakul Preet Singh Slays Hard 🥵🥵#RakulPreet #RakulPreetSingh pic.twitter.com/cZsHTIDR9O
— JosD92 (@JosD92official) October 31, 2025
ఇదంతా చూస్తే అజయ్ భార్య కాజోల్ ఇంట్లో గట్టిగానే క్లాస్ పీకుతుంది అంటూ ఫన్నీ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. సినిమాకు హైప్ పెంచే ప్రయత్నంలో భాగంగానే రకుల్ ఇటువంటి స్టైలింగ్‌ను ఎంచుకున్నారా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఏది ఏమైనా, 'దే దే ప్యార్ దే 2' సినిమా కంటే కూడా రకుల్ డ్రెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పడిందనేది వాస్తవం. అవకాశాలు కోసమే రకుల్ ఇలా అందాలు ఆరబోస్తుందంటూ నెటిజన్లు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications