జీవితంలో ఎన్నో వదులుకున్నాను..రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది.

Rakul Preet Singh s comments on nepotism

రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

ఇదిలా ఉంటే రకుల్‌ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నెపోటిజం‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నెపోటిజం‌పై రకుల్ మాట్లాడుతూ..నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదు. నా తండ్రి సలహాలు, సూచనలు నాకు చాలా నేర్పించాయి. కొన్ని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఛాన్స్‌లు మిస్ అవ్వడం అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్. మనకు దక్కని వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. నేను వ్యక్తిగతంగా ఎదగడం కోసం మాత్రమే ఆలోచిస్తాను. కానీ ఒక స్టార్ కిడ్‌కు వచ్చినన్నీ అవకాశాలు మిగతావారికి రావడం కష్టమంటూ నెపోటిజం‌పై తొలిసారి ఓపెన్ అయింది. నెపోటిజం‌పై రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+