viral video: రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం...స్టేజ్ పైనే అలా..
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. లైక్యం, సరైనోడు, ధ్రువ, జయజానకినాయక, నాన్నకు ప్రేమతో.. ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగారు. ఇటీవల టాలీవుడ్ లో నటించడం తగ్గించారు. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.
ఓ ప్రైవేట్ అవార్డు వేడుకలో నటి రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ అవార్డు ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన రకుల్.. ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ జగ్గీకి అవార్డును అందించారు. అయితే రకుల్ చేతులమీదుగా అవార్డు తీసుకున్న జగ్గీ.. కనీసం ఆమెకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దాంతో ఒక్కసారిగా షాక్ తిన్న రకుల్.. అతడివైపు సీరియస్ గా చూస్తూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
So Here's The Clarification Of Lakshya Jaggi About This Incident Of Rakul Preet Singh. https://t.co/MhurlN7fSU pic.twitter.com/HgptBZAb48
— आदेश 🚩 (@ADfanatic_New) February 23, 2026
అయితే ఇదే విషయంపై స్పందించిన జగ్గీ.. తనకు ముందు ఉన్న మహిళకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని.. అది గమనించి తాను కూడా అలాగే నార్మల్ గా వెళ్లిపోయానని తెలిపాడు. వ్యక్తిగతంగా ఎలాంటి అసహనం లేదన్నాడు. అయితే ఈ ఘటనపై కొందరు జగ్గీను తప్పుపడుతున్నారు. అవార్డు తీసుకునేటప్పుడు అతడి ప్రవర్తన సరిగా లేదని ఆరోపించారు. మరికొంతమంది మాత్రం ఇది చిన్న పొరపాటు అని తేల్చేస్తున్నారు.

ఇక రకుల్ ప్రీత్ సింగ్.. 2011లో విడుదలైన కెరటం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం లౌక్యం, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో వంటి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications