మంచు మనోజ్ మూవీలో రామ్ చరణ్.. తమిళ్ స్టార్ హీరో కూడా !!

మంచు మనోజ్.. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. కానీ మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. విభిన్న పాత్రలతో తన నటనా టాలెంట్ నిరూపించుకున్నాడు. సహజమైన నటనతో పాటు ప్రయోగాత్మక సినిమాల పట్ల కూడా ఆసక్తి చూపి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగానే కెరీర్ ప్రారంభించిన మనోజ్.. దొంగోడు సినిమాతో హీరోగా మారారు.

కాగా మనోజ్ కెరీర్‌లో ముఖ్యమైన మలుపు తీసుకొచ్చిన చిత్రం 'బిందాస్'. ఆ సినిమా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా, యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించింది. ఆ తర్వాత 'వేదం', 'ప్రయాణం', 'ఝుమ్మంది నాదం', నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ.. వంటి సినిమాలు తన కంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. ముఖ్యంగా 'వేదం' సినిమాలో కూడా ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది.

ram-charan-and-simbu-going-to-act-in-manchu-manoj-david-reddy

అయితే ఆ ఆశించిన స్థాయిలో సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం.. పలు పర్సనల్ కారణాల వాళ్ల దశాబ్ద కాలం పాటు మూవీస్ కి బ్రేక్ ఇచ్చారు. కాగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. రీఎంట్రీలో 'భైరవం', 'మిరాయ్' చిత్రాలలో విలన్‌గా నటించి విజయాలు సాధించడంతో తిరిగి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు హీరోగా 'డేవిడ్ రెడ్డి' అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రంతో హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథ ప్రకారం, ఇందులో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కీలక పాత్రలుంటాయి. ఈ ముఖ్య పాత్రలకు స్టార్ నటులను సంప్రదించారని టాక్ వినిపిస్తుంది. ఒక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో సిలంబరసన్ టీఆర్ (శింబు) అంగీకరించారని.. రెండవ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను అడిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ అంగీకారం కోసం చిత్ర బృందం ఎదురుచూస్తోంది.

అయితే మంచు మనోజ్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. వారి మధ్య రిలేషన్ గురించి మనోజ్ గతంలో పలు సందర్భాల్లో భావోద్వేగంగా ప్రకటించారు. దాంతో డేట్స్ సమస్యలున్నా, మనోజ్ అడిగితే చరణ్ కాదనరని.. ఈ సినిమాలో చరణ్ నటించడం పక్కా అంటూ ఫిక్స్ అవుతున్నారు. అన్న మంచు విష్ణు కోసం ప్రభాస్ 'కన్నప్ప'లో నటించినట్టే.. తమ్ముడు మనోజ్ కోసం చరణ్ 'డేవిడ్ రెడ్డి'లో యాక్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+