రామ్ చరణ్- ఉపాసనకు కవల పిల్లలు: డబుల్ హ్యాపీలో మెగా ఫ్యామిలీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కవల బిడ్డలకు స్వాగతం పలికారు. ఒక బాబు, ఒక పాప. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ వెల్లడించారు. దీనిపై శనివారం అర్ధరాత్రి ట్వీట్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం కవల పిల్లలను స్వాగతించారని తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాసనకు ఇది రెండో కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చారామె. 2023 జూన్ 20న క్లింకారా పుట్టారు. రెండున్నరేళ్ల తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించడం, ఓ బాబు, ఓ పాప కావడంతో రామ్ చరణ్ ది ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయింది. ఆ ఆనందం.. చిరంజీవి, సురేఖ పెట్టిన పోస్ట్ లో కనిపించింది.

భగవంతుడి ఆశీస్సులు, అపారమైన ఆనందంతో ఈ ఇద్దరు చిన్నారులను తమ కుటుంబంలోకి స్వాగతిస్తోన్నామని, తాత మామ్మలుగా ఎంతగానో సంతోషిస్తున్నామని చిరంజీవి, సురేఖ పేర్కొన్నారు. అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ట్వీట్ లో రాశారు.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
ఈ సంక్రాంతికి విడుదల అయిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పటికే జోష్ లో ఉంది మెగాస్టార్ కుటుంబం. 300 కోట్ క్లబ్ లో చేరిందీ మూవీ. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలతో పోల్చుకుంటే రేసులో టాప్ లో నిలిచింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఈ సంతోష సమయాన్ని రెట్టింపు చేస్తూ రామ్ చరణ్- ఉపాసన దంపతులు కవల పిల్లలకు స్వాగతం పలికారు.
ట్విన్స్ కు జన్మనిచ్చిన సెలెబ్రిటీలు తక్కువే. టాలీవుడ్ లో మోహన్బాబు ఫ్యామిలీలోనే కవలలు పుట్టారు. ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు- వెరోనికా దంపతులు కవల బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఓ స్టార్ హీరో కుటుంబంలో ట్విన్స్ జన్మించడం ఇదే తొలిసారి. తమిళనటి నమిత, బాలీవుడ్ లో సంజయ్ దత్- మాన్యత దంపతులకు కవల పిల్లలు పుట్టారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications