రామ్ చరణ్- ఉపాసన కవల పిల్లల పేర్లు: అ సెంటిమెంట్: చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కవల బిడ్డలకు జన్మనిచ్చిన ఆనందంలో ఉన్నారు. మెగా కాంపౌండ్ లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. కిందటి నెల 31వ తేదీన రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఒక బాబు, ఒక పాపకు స్వాగతం పలికారు. ఉపాసనకు ఇది రెండో కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చారామె. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించడం, ఓ బాబు, ఓ పాప కావడంతో రామ్ చరణ్ ది ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయింది.

ఇప్పుడు తాజాగా ఆ చిన్నారులకు రామ్ చరణ్ దంపతులు నామకరణం చేశారు. పేర్లు పెట్టారు. చిన్నారులకు శివరాం, అన్వీరా దేవి అని పేరు పెట్టినట్లు ఎన్డీటీవీ తెలిపింది. నాయనమ్మ అంజనాదేవి పేరు కలిసి వచ్చేలా పాపకకు అన్వీరా దేవి అని పెరు పెట్టినట్లు తెలుస్తోంది. అ సెంటిమెంట్ ను అనుసరించేలా పేరును సెలెక్ట్ చేసినట్ట యింది. కవల పిల్లల జననం తర్వాత, రామ్ చరణ్, ఉపాసన తమ తొలి అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Ram Charan and Upasana Reveal Reveal Twin Babies A Boy and a Girl Named Shivram and Anveera Devi

ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులకు కృతజ్ఞతను తెలుపుకొన్నారు. "మాకు ఒక బాబు, ఒక పాప జన్మించినందుకు సంతోషంగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఇంట్లో ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలం. మహిళలు ప్రతి క్షణంలో మాకు అండగా నిలిచారు. మా కుటుంబానికి మద్దతు ఇచ్చిన అశేష అభిమానులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము.." అని పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+