దేశంలో ఏ నిర్మాతకు లేనంత భారీ నష్టాన్ని మిగిల్చిన 'గేమ్‌ఛేంజర్‌'‌

ఒకేఒక్కడు, అపరిచితుడు, జంటిల్ మెన్, జీన్స్, రోబో లాంటి కళాఖండాలను రూపొందించి దక్షిణ భారతదేశంలోనే అగ్రశ్రేణి దర్శకుడిగా పేరుపొందిన శంకర్ కాలానికి అనుగుణంగా మారకుండా మొదటి నుంచి తాను తీసిన కథ, కథనాల శైలిలోనే సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. స్నేహితుడు, రోబో2, ఐ, భారతీయుడు2 లాంటి ఘోర పరాజయాలను ప్రేక్షకులకు అందించాడు. శంకర్ తో సినిమా తీయాలంటేనే నిర్మాతలంతా భయపడే పరిస్థితి వచ్చింది. వద్దని చెప్పినప్పటికీ భారతీయుడు2 తీసి భారతీయుడు సినిమాకు ఉన్న మంచిపేరును చెడగొట్టాడు.

గేమ్ ఛేంజర్ ఆడుతుందనే నమ్మకం ఎవరికీ లేదు
నిర్మాతల డబ్బు అంటే అతనికి ఏమాత్రం గౌరవం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దిల్ రాజు తన బ్యానరుపై 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మక సినిమాను రూపొందించాలని భావించి శంకర్ ను దర్శకుడిగా ఎంచుకున్నారు. అదే అతను చేసిన అతిపెద్ద తప్పు. కథ నచ్చడంతో రామ్ చరణ్ కూడా పచ్చజెండా ఊపాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దాన్ని హఠాత్తుగా వదిలేసి భారతీయుడు2 చిత్రాన్ని పూర్తిచేయడానికి వెళ్లిపోయారు. అది విడుదలై అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. తిరిగి గేమ్ ఛేంజర్ ను పూర్తిచేశాడు. ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం ఎవరికీ లేకుండా పోయింది.

ram charan game changer movie loss 370 crore rupees

కాలం చెల్లిన కథ కావడంతో థియేటర్లకు జనాలు రాలేదు
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు గేమ్ ఛేంజర్ ను నిర్మించాడు. కాలం చెల్లిన కథ, కథనాలతో సినీ ప్రియులంతా థియేటర్లకు రావడమే మానేశారు. ప్రయివేటు కేబుల్ నెట్ వర్క్స్ లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా మొదటిరోజు రూ.186 కోట్లు వచ్చిందని నిర్మాత పోస్టర్ వేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా చేయొద్దంటూ రామ్ చరణ్ కూడా చెప్పడంతో కలెక్షన్ల వివరాలను వదిలేశారు. 2025లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాగా, అత్యంత ఖరీదైన సినిమాగా విడుదలైంది. గేమ్ ఛేంజర్ మొదటిరోజు రూ.51 కోట్లు వసూలు చేసింది. 13 రోజులకు గాను ఆ సినిమాకు వచ్చింది కేవలం రూ.128 కోట్లు. ఈ సినిమా 13వ రోజు రూ.70 లక్షలు రాబట్టింది. డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండూ బాగుండటంతో దీనిపై అతిపెద్ద దెబ్బ పడింది. మొత్తంగా ఈ సినిమా రూ.500 కోట్లతో నిర్మితమై నిర్మాతకు రూ.370 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+